గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్

హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్. పోలీసులు నిందితుడిగా పేర్కొంటున్న కారు డ్రైవర్ కృష్ణమిలన్ రావుని అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 07:59 AM IST
గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్

హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్. పోలీసులు నిందితుడిగా పేర్కొంటున్న కారు డ్రైవర్ కృష్ణమిలన్ రావుని అరెస్ట్

హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్. పోలీసులు నిందితుడిగా పేర్కొంటున్న కారు డ్రైవర్ కృష్ణమిలన్ రావుని అరెస్ట్ చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 12 వరకు కృష్ణమిలన్ రావును అరెస్ట్ చేయొద్దని చెప్పింది. కొద్దిరోజుల క్రితం గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై కారు యాక్సిడెంట్ జరిగింది. అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా… పలువురు గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పారు. కారు నడిపిన కృష్ణమిలన్ రావుని అరెస్ట్ చేస్తామన్నారు.

దీనిపై కృష్ణమిలన్ రావు హైకోర్టుని ఆశ్రయించారు. ప్రమాదానికి అసలు కారణం అతివేగం కాదు.. ఫ్లైఓవర్ డిజైన్ సరిగ్గా లేకపోవడమే అని తన పిటిషన్‌లో తెలిపారు. యాక్సిడెంట్ తర్వాత గాయాలతో ఆస్పత్రిలో చేరిన కృష్ణమిలన్ రావు… ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఫ్లైఓవర్ డిజైన్ లోపమే ప్రమాదానికి కారణం అంటున్నాడని, దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగింది.

అయితే పోలీసులు మాత్రం.. అతివేగమే ప్రమాదానికి కారణం అని చెబుతున్నారు. ప్రమాదం సమయంలో మిలన్ రావు 104 కి.మీ వేగంతో కారు నడుపుతున్నారని వాదించారు. ఓవర్‌ స్పీడ్‌తో డ్రైవ్‌ చేసి ఒకరి మృతికి కారణమైన కృష్ణ మిలన్‌రావు అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలని రాయదుర్గం పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల పిటిషన్‌పై డిసెంబర్ 12న విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.