Tirumala Shops Fire : తిరుమల ఆస్ధాన మండపం దుకాణాల దగ్దం కేసులో కీలక మలుపు

Tirumala Shops Fire : తిరుమల ఆస్ధాన మండపం దుకాణాల దగ్దం కేసులో కీలక మలుపు

Tirumala Shops Fire

Tirumala Shops Fire :  తిరుమల ఆస్థాన మండపం దుకాణాల వద్ద జరిగిన అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మల్‌ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం వల్లే దుకాణాలు  దగ్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత సమస్యలతోనే మల్‌రెడ్డి సూసైడ్‌ చేసుకున్నట్టు నిర్ధారించారు.

మే 3 సోమవారం రాత్రి తిరుచానూరులోని తన నివాసం నుంచి తిరుమలకు చేరుకున్న మల్‌రెడ్డి ఆస్థాన మండపంలోని 84వ నెంబర్ దుకాణంలో నిద్రించాడు. మంగళవారం తెల్లవారు జామున 4గంటల 29 నిమిషాలకు తిరుమల పెట్రోల్ బంక్‌కు వెళ్లి పెట్రోల్ అడిగాడు. అయితే 6 గంటలకు ఓపెన్ చేస్తామని చెప్పడంతో సమీపంలోని బాలగంగమ్మ ఆలయం వద్ద సెల్ఫీ వీడియో తీసుకున్నాడు మల్‌ రెడ్డి.

ఆ తర్వాత 6 గంటలకు వెళ్లి 2వందల రూపాయలకు పెట్రోల్‌ పట్టించుకుని షాప్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఐదు నిమిషాలకే దుకాణం నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో మొత్తం 21 షాపులు కాలి బూడిదయ్యాయి.

పదేళ్లుగా తిరుమలలోని వివిధ ఫోటో స్టూడియోలలో మల్‌ రెడ్డి పనిచేశాడు. ఘటన సమయంలో దుకాణాల వద్ద 12 మంది సిబ్బంది నిద్రిస్తున్నారు. వారిలో హరి అనే యువకుడు అప్రమత్తమై అందరినీ నిద్రలేపటంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

తొలుత దీన్ని ప్రమాద వశాత్తు జరిగిందిగా భావించిన పోలీసులకు విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అగ్నిప్రమాదంలో సజీవదహనమైన మల్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవటంతోనే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు.

అగ్ని ప్రమాదంలో మరణించిన మల్ రెడ్డి తన పర్సు, సెల్ ఫోన్ ను వేరే దుకాణంలో ఉంచగా… పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య శోభ సహాయంతో సెల్ ఫోన్ లాక్ తీసిన పోలీసులు అందులో మృతుడు తీసుకున్న సెల్ఫీ వీడియో గుర్తించారు. కీలకంగా మారిన ఆవీడియోను పోలీసులు బహిర్గత పరచాల్సి ఉంది.

ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకన్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మల్ రెడ్డి ఎలా చనిపోయాడు ? అతని ద్వారానే అగ్ని ప్రమాం జరిగిందా.. లేక మరేదైనా కారణం ఉందా అని వివిధ కోణాల్లో పోలీసులు శోధిస్తున్నారు.

అగ్ని ప్రమాదం జరగటానికి అరగంట ముందు మల్ రెడ్డ పెట్రోల్ తీసుకునిషాపులోకి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్ రెడ్డి పోస్ట్ మార్టం నివేదిక రాగానే ఘటనకు సంబంధించి పూర్తివివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.