సంచలనం రేపిన రాధిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్

కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని రాధిక(16) హత్య కేసులో ఊహించని ట్విస్ట్. మిస్టరీగా మారిన రాధిక కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో

  • Published By: veegamteam ,Published On : March 2, 2020 / 04:12 AM IST
సంచలనం రేపిన రాధిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్

కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని రాధిక(16) హత్య కేసులో ఊహించని ట్విస్ట్. మిస్టరీగా మారిన రాధిక కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో

కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని రాధిక(16) హత్య కేసులో ఊహించని ట్విస్ట్. మిస్టరీగా మారిన రాధిక కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. రాధిక కేసులో కుటుంబసభ్యుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాధికను కుటుంబసభ్యులే చంపినట్లు సందేహిస్తున్నారు. ప్రస్తుతం రాధిక తండ్రి కొమురయ్య పోలీసుల అదుపులో ఉన్నాడు. దీంతో తండ్రే హంతకుడా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు మిస్టరీ ఇవాళ(మార్చి 2,2020) వీడే అవకాశం ఉందని, నిందితులను పోలీసులు ఇవాళే మీడియా ముందు ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..
కరీంనగర్‌ పట్టణంలోని విద్యానగర్ వెంకటేశ్వర కాలనీలో ఫిబ్రవరి 10న ఇంట్లోనే రాధిక దారుణ హత్యకు గురైంది. గొంతు కోసి అతి కిరాతకంగా రాధికను మర్డర్ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ హత్య జరిగింది. ఆ సమయంలో కూలి పనుల కోసం బయటకు వెళ్లామని రాధిక తల్లిదండ్రులు పోలీసులతో చెప్పారు. పక్కింట్లోని తొమ్మిదేళ్ల పిల్లాడు… ఆ ఇంటికి రావడంతో… రాధిక మర్డర్ విషయం వెలుగులోకి వచ్చింది. రాధిక హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. రాధికను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో ఈ కేసు సవాల్ గా మారింది.

తండ్రే హంతకుడా?
ఇంట్లో అద్దెకు ఉండే కుర్రాడు… కొంతకాలంగా రాధిక వెంట పడుతున్నాడని, అతడే చంపి ఉంటాడని తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాఫ్తు చేశారు. ఆ కుర్రాడి కోసం 75 మంది పోలీసులతో… 8 బృందాలు ఏర్పాటు చేశారు. 20 రోజులు వెతికినా… అతను కనిపించ లేదు. ఈలోగా దర్యాప్తులో కొత్త విషయాలు తెలిశాయి.

కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటా, పోస్టుమార్టం రిపోర్ట్ పరిశీలిస్తే… కుటుంబ సభ్యులే ఆమెను చంపేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు రాధికను చంపి ఉంటారని… అనుకుంటున్న పోలీసులు… తాజాగా… రాధిక తండ్రిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం(మార్చి 1,2020) ఆ ఇంట్లో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం. ఇవాళ రాధిక కేసులో మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తండ్రే రాధికను చంపి ఉంటే… ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.

పోలీసులకు నిద్ర లేకుండా చేసిన కేసు:
రాధిక హత్య కేసులో పోలీసులు అన్ని యాంగిల్స్ లో దర్యాఫ్తు జరిపారు. ప్రేమ తిరస్కరణే కారణమన్న కోణంలోనూ విచారణ చేశారు. అయితే ఎలాంటి విషయాలు బయటపడలేదు. రాధిక హత్య కేసు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. హత్య జరిగి వారాలు గడుస్తున్నా… నిందితుడు దొరక్కపోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. హంతకుడిని పట్టుకోవడానికి ఇన్ని రోజులా అంటూ ప్రజల మండిపడ్డారు. ఈ కేసులో పోలీసులు సెలవులు రద్దు చేసుకుని మరీ ఎంక్వైరీ చేశారు. హంతకుడిని పట్టుకునేందుకు జర్మన్ టెక్నాలజీని కూడా వినియోగించారు.

(బాలికను గ్యాంగ్ రేప్ చేసి చెట్టుకి ఉరితీసిన పదో తరగతి విద్యార్థులు దొరికారు)