NIA arrests: దేశంలో పేలుళ్లకు కుట్ర.. ఐఎస్ తీవ్రవాద సంస్థ సభ్యుడు అరెస్ట్

దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఐఎస్ తీవ్రవాద సంస్థ సభ్యుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. మోసిన్ అహ్మద్ అనే నిందితుడు దేశంలోని ఐఎస్ సానుభూతి పరుల నుంచి విరాళాలు సేకరిస్తూ సిరియాకు పంపుతున్నాడు.

NIA arrests: దేశంలో పేలుళ్లకు కుట్ర.. ఐఎస్ తీవ్రవాద సంస్థ సభ్యుడు అరెస్ట్

NIA arrests: రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నిన తీవ్రవాద ముఠా సభ్యుల్ని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) వరుసగా అరెస్టు చేస్తోంది. తాజాగా ఢిల్లీలో ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) గ్రూప్ సభ్యుడిని అరెస్టు చేసింది. బిహార్‌లోని పాట్నాకు చెందిన మోసిన్ అహ్మద్ అనే ఐఎస్ సభ్యుడు ఆ సంస్థ కోసం నిధులు సేకరిస్తుండగా, ఎన్ఐఏ అరెస్టు చేసింది.

Nikhat Zareen: బాక్సింగ్‌లో భారత్‌కు మరో పతకం.. నిఖత్ జరీన్‍‌కు స్వర్ణం

ఢిల్లీలోని బాట్లా హౌజ్‌లో ఉన్న అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి, పలు ఆధారాలు సేకరించింది. దేశంలో ఉన్న ఐఎస్ సానుభూతి పరుల నుంచి మోసిన్ విరాళాలు సేకరిస్తున్నట్ల ఎన్ఐఏ గుర్తించింది. ఇలా సేకరించిన నిధులను అతడు సిరియాతోపాటు ఇతర దేశాలకు క్రిప్టోకరెన్సీ రూపంలో పంపుతున్నాడు. అతడ్ని అధికారులు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలో పేలుళ్లకు తీవ్రవాదులు కుట్ర పన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో ఎన్ఐఏ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ముమ్మరంగా దాడులు నిర్వహిస్తోంది. మహారాష్ట్రతోపాటు ఏడు రాష్ట్రాల్లోని 13 చోట్ల ఇటీవల దాడులు నిర్వహించింది. గత నెల 31న జరిపిన దాడుల్లో 35 మందిని, ఆగష్టు 1న జరిపిన దాడుల్లో 13 మందిని అరెస్టు చేసింది.

Cow Dung Rakhis: ఆవుపేడతో తయారైన రాఖీలు.. విదేశాలకు ఎగుమతి

వీరంతా దేశంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు సమాచారం. గత ఏడాది అరెస్టైన జుర్ఫీ జోహార్ దామోదీ అనే ఐఎస్ సానుభూతిపరుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. తీవ్రవాద సంస్థలు మన దేశంలోకి అక్రమంగా ఆయుధాలు సరఫరా చేయడంతోపాటు, డ్రగ్స్ కూడా రవాణా చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో అత్యంత చురుగ్గా పనిచేస్తున్న ఎన్ఏఐ తీవ్రవాద కార్యకలాపాలతోపాటు, గ్యాంగ్‌స్టర్లపై దృష్టిపెట్టింది.