Telangana Crime News : పెళ్లి పేరుతో వల ….హైదరాబాద్ యువతి నుంచి రూ.10 లక్షలు కాజేసిన నైజీరియన్

మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పరిచయం చేసుకుని పెళ్ళి చేసుకందామని చెప్పి హైదరాబాద్ కు చెందిన యువతి నుంచి రూ.10 లక్షలు దండుకున్ననైజీరియన్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Crime News : పెళ్లి పేరుతో వల ….హైదరాబాద్ యువతి నుంచి రూ.10 లక్షలు కాజేసిన నైజీరియన్

Marriage Cheating

Telangana Crime News : మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పరిచయం చేసుకుని పెళ్ళి చేసుకందామని చెప్పి హైదరాబాద్ కు చెందిన యువతి నుంచి రూ.10 లక్షలు దండుకున్ననైజీరియన్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బేగంపేటకు చెందిన యువతి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో తన ప్రోఫైల్ ను తెలుగు మ్యాట్రిమోనీ  వెబ్‌సైట్‌లో   క్రియేట్ చేసింది. ఆమె ప్రోఫైల్ చూసిన   ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ ఇంట్రెస్ట్ మెసేజ్ పంపించాడు. తాను యూఎస్ లో ఫార్మసిస్టుగా పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఈక్రమంలోఇద్దరూ ఫోన్ నెంబర్లు తెలుసుకుని ఒకరినొకరు పరిచయం చేసుకుని మట్లాడుకోవటం మొదలెట్టారు.

ఆక్రమంలో నీకు గిఫ్ట్ పంపిస్తున్నాను అంటూ ఒక పార్సిల్ పంపించాడు. ఆతర్వాత ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్ల మంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీకు గిఫ్ట్ రూపంలో డాలర్స్ వచ్చాయని..అవి చట్టవిరుధ్దమైనవని వాటికి మీరు టాక్స్‌లు కట్టాలని చెప్పి యువతి వద్ద నుంచి రూ.10 లక్షలు దండుకున్నాడు.

రూ.10 లక్షలు కట్టినా గిఫ్ట్ రాకపోయే  సరికి మోసపోయానని గ్రహించిన యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్టర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.