లారీ ఢీకొని తొమ్మిది నెలల గర్భిణి మృతి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలకేంద్రంలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందింది.

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 08:46 AM IST
లారీ ఢీకొని తొమ్మిది నెలల గర్భిణి మృతి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలకేంద్రంలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందింది.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలకేంద్రంలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందింది. పెనుబల్లి మండల పరిధిలోని రామచంద్రరావు బంజరకు చెందిన బలుసుపాటి మురళి, కల్యాణి భార్యాభర్తలు. కల్యాణి తొమ్మిదినెలల గర్భిణి. నెల పరీక్షల్లో భాగంగా భార్యాభర్తలిద్దరూ పెనుబల్లి ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షల అనంతరం వైద్యులు, మార్చి 2వ తేదీన ప్రసవానికి ఖరారు చేశారు.

తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుందని చెప్పడంతో గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మరో రెండు నిమిషాలలో ఇంటికి చేరుకోవాల్సిన ఆ దంపతులను వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న కల్యాణీ కిందపడిపోయింది. నిండు గర్భిణికి లారీ బలంగా తగలడంతో కడుపులో బిడ్డ బయటకొచ్చి పది మీటర్ల దూరంలో పడిపోయింది.

తల్లీ లారీ టైర్ల కింద పడి ఛిద్రమై అక్కడిక్కడే మరణిచింది. దూరంగా పడిన శిశువు కొన ఊపిరితో పది నిమిషాలు కొట్టుకుని చనిపోయింది. ప్రమాదంలో మృతురాలి భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషాధ ఘటన అందరినీ కలిచివేసింది. తల్లి, బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి