ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్న నీరవ్

 పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే.

  • Published By: venkaiahnaidu ,Published On : March 21, 2019 / 02:12 PM IST
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్న నీరవ్

 పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే.

 పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే. అయితే స్కామ్ వెలుగులోకి వచ్చిన ఏడాదికి లండన్ పోలీసులకు చిక్కిన నీరవ్..ఈ ఏడాదికాలంలో కేసు నుంచి తప్పించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు.తన ఫేస్ ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీకి కూడా నీరవ్ ఓ దశలో సిద్దపడినట్లు తెలుస్తోంది.

కేసు నుంచి తప్పించుకునేందుకు అతి చిన్న పసిఫిక్‌ ద్వీపమైన వనౌటు దేశంలో సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం,బ్రిటన్ లో ఆశ్రయం పొందేందుకు పెద్ద పెద్ద న్యాయ సంస్థలను కలవడం, సింగపూర్‌ లో శాశ్వత నివాసం కోసం నీరవ్ అనేక ప్రయత్నాలు చేశాడు.అయితే ఈ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఒకదశలో…ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపాన్ని మార్చుకునేందుకు రెడీ అయ్యాడు.
Read Also : వింతల్లోనే వింత : అప్పుడే పుట్టిన చిన్నారి కడుపులో.. మరో బేబీ

ఈ సమయంలోనే పది రోజుల క్రితం లండన్ వీధుల్లో దర్జాగా తిరుగుతూ స్థానిక రిపోర్టర్ కంటపడ్డాడు.మీసాలు.గడ్డం పెంచి,హెయిర్ స్టైల్ మార్చి,డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మార్చుకొని ఉన్న నీరవ్ ని గుర్తించిన ఆ రిపోర్టర్ వెంటనే నీరవ్ దగ్గరకు పరుగెత్తుకెళ్లాడు.జర్నలిస్ట్ వేసిన ప్రశ్నలన్నింటికీ నో కామెంట్స్ అని చెబుతూ మెల్లగా అక్కడి నుంచి నీరవ్ తప్పించుకున్నాడు.లండన్ లోని ఖరీదైన వెస్ట్ ఎండ్ ఏరియాలోని ఓ అపార్ట్ మెంట్ లో నీరవ్ నివిసిస్తున్నట్లు టెలిగ్రాఫ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.నీరవ్ ఆచూకీ తెలియడంతో అలర్ట్ అయిన భారత అధికారులు లండన్ పోలీసులను కాంటాక్ట్ అయ్యారు.నీరవ్ ని అరెస్ట్ చేయాలని బ్రిటన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు.

ఈ సమయంలో రెండు రోజుల క్రితం లండన్‌లోని మెట్రో బ్యాంక్‌ శాఖలో ఖాతా తెరవడానికి వచ్చిన నీరవ్‌ ను అక్కడి సిబ్బంది ఒకరు గుర్తుపట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అరెస్టు చేశారు.బెయిల్ కోరుతూ నీరవ్ పెట్టుకున్న పిటిషన్ ను బుధవారం(మార్చి-21,2019)లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు కొట్టేసింది.నీరవ్ ని మార్చి-29,2019 వరకు రిమాండ్ కు అప్పగిస్తూ తీర్పుని వాయిదా వేసింది.నీరవ్ ను భారత్ తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

2018ఫిబ్రవరిలో పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే స్కామ్ వెలుగులోకి రాకముందే ఇద్దరు ప్రధాన నిందితులు నీరవ్ మోడీ,మెహుల్ ఛోక్సీ దేశం వదిలి పారిపోయారు. వీరి ఆచూకీ కోసం భారత దర్యాప్తు సంస్థలు అనేక ప్రయత్నాలు చేశాయి. ఇంటర్‌పోల్‌ను కూడా ఆశ్రయించడంతో నీరవ్‌, ఛోక్సీలపై అరెస్టు వారెంట్‌ కూడా జారీ అయిన విషయం తెలిసిందే.  
Read Also : మెగా బ్రదర్స్ గట్టెక్కేనా : వెస్ట్ గోదావరి ఎందుకు ?