నిర్భయ దోషుల చివరి కోరిక….ఇంకా ఆశపడుతున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : January 23, 2020 / 01:29 PM IST
నిర్భయ దోషుల చివరి కోరిక….ఇంకా ఆశపడుతున్నారు

నిర్భయ దోషులను ఫిబ్రవరి-1,2020 ఉదయం 6గంటలకు దేశ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఉరితీసేందుకు ఇప్పటికే తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ కేసులోని నలుగురు దోషులను ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు దోషులను ఒకేసారి ఉరిశిక్షకు తీసుకువెళతారు కాబట్టి, నలుగురు దోషులు ఎటువంటి ఇబ్బందులను సృష్టించలేని విధంగా తీవ్రమైన అప్రమత్తత మరియు శాంతి అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఉరికి ఇంక వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో..మీ చివరి కోరిక ఏంటి అని దోషులును తీహార్ జైలు అధికారులు అడగగా..వాళ్లు మాత్రం మౌనం వహించారు. కుటుంబ సభ్యులను కలవడం, తమకు చెందిన ఆస్తులను ఇష్టపూర్వకంగా ఇతరులకు ఇవ్వడం వంటి ఏ ఇతర అంశాలపైనా దోషులు మాట్లాడేందుకు నిరాసక్తత చూపారు. మాకు ఇది కావాలి..అది చేయాలని ఏం చెప్పకుండా మోనంగా ఉండిపోయారు. అయితే వాళ్లు మోసం వహించడాన్ని బట్టి చూస్తే తమను ఉరితీసేందుకు ఇంకా ఆలస్యమవుతందని నలుగురు దోషులు ఇంకా ఆశతో ఉన్నట్లు కన్పిస్తోంది.

దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.