ప్రధానిపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు:నిర్మల్ వ్యక్తి అరెస్ట్

ఆదిలాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని నిర్మల్‌కు చెందిన యూనిస్ ఖాన్‌గా గుర్తించారు.

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 10:21 AM IST
ప్రధానిపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు:నిర్మల్ వ్యక్తి అరెస్ట్

ఆదిలాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని నిర్మల్‌కు చెందిన యూనిస్ ఖాన్‌గా గుర్తించారు.

ఆదిలాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని నిర్మల్‌కు చెందిన యూనిస్ ఖాన్‌గా గుర్తించారు. ముథోల్ మండలం తరోడాకు చెందిన యూనిస్ ఖాన్.. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర ఫొటో పెట్టాడు. దీన్ని గమనించిన భైంసా బీజేపీ కార్యకర్తలు సీరియస్ అయ్యారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఐటీ యాక్ట్‌ కింద యూనిస్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విద్వేషం రెచ్చగొట్టేలా యూనిస్ పోస్టులు ఉన్నాయని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. యూనిస్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

దేశ ప్రధాని అంటే అత్యున్నతమైన, రాజ్యాంగబద్దమైన, గౌరవప్రదమైన పదవి. అలాంటి పదవిలో ఎవరు ఉన్నా కచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే. ఆ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరచడం చట్టరిత్యా నేరం అవుతుంది. భావప్రకటనా స్వేచ్చ పేరుతో ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో లిమిట్స్ క్రాస్ చేసే వాళ్లు ఎక్కువయ్యారు. హద్దులు దాటి దేశ ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులపై నోటికొచ్చిన రాతలు రాస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 

సోషల్ మీడియాను మిస్ యూజ్ చేసే ఘటనలు ఎక్కువ కావడంతో ఐటీ యాక్ట్‌ను కఠినతరం చేశారు. గీత దాటితే జైల్లో వేస్తున్నారు. సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ ఫ్లాట్ ఫామ్స్.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, యూట్యూబ్‌.. వేదిక ఏదైనా.. అనుచిత కామెంట్స్ చేయడం తగదు. ఎదుటి వ్యక్తిపై దూషణలు చేయకూడదు. అసభ్య పదజాలం ఉపయోగించకూడదు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదు. ఫొటోలు పెట్టకూడదు. అలాంటి మెసేజ్‌లను ఫార్వార్డ్‌ చేయడమూ నేరమే. అసభ్య, అభ్యంతరకర రాతలు రాసినా జైలుకెళ్లాల్సిందే. ఆ పోస్టింగ్‌లు షేర్ చేసినా కటకటాలు లెక్కించాల్సిందే. అవి తాము సృష్టించలేదని, కేవలం షేర్‌ చేశామని చెప్పినా.. తర్వాత ప్రయోజనం ఉండదు. సోషల్‌ మీడియాలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారు. ఇలాగే అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.