Nizamabad Family Suicide : విజయవాడలో నిజామాబాద్ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య కేసులో రాజకీయ నేత పేరు..!

తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన వ్యాపారి పప్పుల సురేశ్ కుటుంబం ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేత పేరు వినిపిస్తోంది.

Nizamabad Family Suicide : విజయవాడలో నిజామాబాద్ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య కేసులో రాజకీయ నేత పేరు..!

Nizamabad Family Suicide

 

Nizamabad Family Suicide : తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన వ్యాపారి పప్పుల సురేశ్ కుటుంబం ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఓ రాజకీయ నేత పేరు బయటకు వచ్చింది. అప్పుల కోసం సురేశ్ కుటుంబాన్ని నలుగురు వ్యక్తులు వేధించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ నలుగురి పేర్లను పోలీసులు రికార్డులో నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆ నలుగురిని నిర్మల్ కు చెందిన వినీత, చంద్రశేఖర్, నిజామాబాద్ కు చెందిన ఓ జాతీయ పార్టీ నేత గణేష్, జయకర్ గా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

కాగా, సూసైడ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత సూసైడ్ చేసుకునేందుకు కుటుంబసభ్యులు నలుగురూ ఇన్సులిన్ ని ఇంజెక్ట్ చేచేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. తల్లి శ్రీలత, కుమారుడు ఆశిష్ స్పృహ కోల్పోయారు. తండ్రి పప్పుల సురేష్, మరో కుమారుడు అఖిల్ మాత్రం స్పృహలోనే ఉన్నారు. తమకు ఇన్సులిన్ వల్ల లాభం లేదని కృష్ణా నదిలోకి దూకి సూసైడ్ చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు సురేష్, అఖిల్. నలుగురి మృతదేహాలకు డాక్టర్లు పోస్టుమార్టం పూర్తి చేశారు. కుటుంబసభ్యులు మృతదేహాలను విజయవాడ నుండి నిజామాబాద్ కు తరలించారు.

Visakhapatnam Constable : అదృశ్యమైన క్రైమ్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన సురేష్ బావమరిది అస్వస్థతకు గురయ్యారు. సోదరి, బావ, ఇద్దరు మేనల్లుళ్ల మృతదేహాలను చూసి బోరున విలపిస్తూ స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు విజయవాడ పోలీసులు. ఆత్మహత్యకు ముందు తన బావమరిదికి ఆడియో, వీడియో మేసేజ్ లు పంపాడు సురేశ్. కొంతమంది బెదిరింపుల వల్లే సురేశ్ కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నలుగురు వ్యక్తులు సురేశ్ ను తీవ్రంగా వేధించారని వాపోయారు. వేధింపులకు గురి చేసిన నలుగురి పేర్లను స్టేట్ మెంట్ లో రికార్డు చేశారు పోలీసులు.

నిజామాబాద్‌ గంగాస్థాన్‌ ఫేజ్-2లో నివాసం ఉంటున్న పప్పుల సురేశ్‌ (51), భార్య శ్రీలత (48), కుమారులు అఖిల్‌ (28), ఆశిష్‌ (24) ఈ నెల 6న విజయవాడకు వచ్చారు. అఖిల్‌ పేరుతో సాయంత్రం ఐదు గంటల సమయంలో విజయవాడ బ్రాహ్మణ వీధిలోని ఒక ప్రైవేట్‌ సత్రంలో రూమ్‌ తీసుకున్నారు. వారంతా శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అర్ధరాత్రి దాటాక సురేశ్‌ కుటుంబ సభ్యులు తమ బంధువులకు.. తాము చనిపోతున్నట్లు వాయిస్‌ మెసేజ్‌ పంపించారు.

 

దాంతో శ్రీలత సోదరుడు విజయవాడలో తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి సత్రం ఫోన్‌ నంబర్‌ కనుగొన్నారు. శనివారం ఉదయం ఆరున్నర గంటలకు సత్రానికి ఫోన్‌ చేసి తమ బంధువులు సత్రంలో బస చేశారని, వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్‌ పెట్టారని, తక్షణం వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సత్రం గుమాస్తా ఆ గదికి వెళ్లి చూసేసరికి తల్లి, కుమారుడు విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సత్రం అధ్యక్షుడు పోలీసులకు సమాచారమిచ్చారు. అదే సమయంలో ప్రకాశం బ్యారేజీలో తండ్రీ, కొడుకుల మృతదేహాలు కనుగొన్నారు. వారి దగ్గరున్న ఆధారాలను బట్టి వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

Crime News: దండుపాళ్యన్ని మించిన కర్నూలు గ్యాంగ్, వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్

ఆశిష్‌ బీ ఫార్మసీ చదివాడు. అతడికి మెడికల్‌ పరిజ్ఞానం ఉంది. దీంతో కుటుంబ సభ్యులంతా ఇన్సులిన్‌ అధిక మోతాదులో తీసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వెంట తెచ్చుకున్న ఇంజెక్షన్లను ఆశిష్‌ సాయంతో అందరూ తీసుకున్నారు. దాంతో తల్లి శ్రీలత, చిన్న కుమారుడు ఆశిష్‌ ముందుగానే స్పృహ తప్పినట్లు తెలిసింది. ఆ తరువాత తండ్రి సురేశ్‌ పెద్ద కుమారుడు అఖిల్‌ నదిలో దూకాలని నిర్ణయించుకొని ప్రకాశం బ్యారేజీ మీదకు వెళ్లి 52వ కానా నుంచి నదిలోకి దూకారు.

తమ ఫ్లాట్‌పై సురేశ్‌ సుమారు రూ.30 లక్షల మేర అప్పు చేసినట్లు తెలిసింది. సురేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేశారని వెల్లడైంది. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అనే ఫైనాన్స్‌ సంస్థ బకాయిల వసూలు కోసం శుక్రవారం సురేశ్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా ఎవరూ లేకపోవడంతో ఫ్లాట్‌ గోడపై ‘ఈ ఆస్తి పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌’కి చెందినదిగా రాసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారు, ఫైనాన్స్‌ వారి నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సురేశ్‌ కుటుంబం 15 రోజుల క్రితమే ఊరు వదిలి వచ్చినట్లు తెలిసింది. ఎంతో ఆనందంగా, అందరితో బాగా ఉండే సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర వేదనకు గురిచేసిందని స్థానికులు కంటతడి పెట్టారు.

అప్పులు, అధిక వడ్డీలు సురేశ్ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అంచెలంచెలుగా ఎదిగిన ఆ కుటుంబం అప్పుల కారణంగా పరిస్థితులు తారుమారు కావడంతో రోడ్డున పడింది. ఆస్తులన్నీ అప్పులకే పోగా.. ఇంకా కట్టాల్సిన బకాయిల కోసం అప్పుల వాళ్లు ఎదురు చూస్తుండటంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.