లాక్‌డౌన్ సమయంలో బయట తిరగాలని డాక్టర్ గెటప్‌

నోయిడాలో లాక్ డౌన్ తప్పించుకునేందుకు డాక్టర్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్న వ్యక్తికి జైలు శిక్ష లాక్ డౌన్ తప్పించుకునేందుకు డాక్టర్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్న వ్యక్తికి జైలు శిక్ష పడింది.

  • Published By: veegamteam ,Published On : April 2, 2020 / 12:16 AM IST
లాక్‌డౌన్ సమయంలో బయట తిరగాలని డాక్టర్ గెటప్‌

నోయిడాలో లాక్ డౌన్ తప్పించుకునేందుకు డాక్టర్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్న వ్యక్తికి జైలు శిక్ష లాక్ డౌన్ తప్పించుకునేందుకు డాక్టర్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్న వ్యక్తికి జైలు శిక్ష పడింది.

లాక్ డౌన్ తప్పించుకునేందుకు డాక్టర్ డ్రెస్ వేసుకొని నోయిడాలో తిరుగుతున్న వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఓ వ్యక్తికి ల్యాబ్ కోట్, వైట్ గ్లోవ్స్ మరియు సర్జికల్ మాస్క్ ఉన్నాయి. కానీ అతనిపై పోలీసులకు అనుమానం కలిగింది. బుధవారం నోయిడా వీధుల్లో గస్తీ తిరుగుతున్న ఒక అధికారి.. అక్కడ ఉన్న అశుతోష్ శర్మ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. శర్మ సమాధానం చెప్పడానికి సంశయించాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది.

కాన్పూర్ నుండి వచ్చిన అశుతోష్ శర్మ, కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 21 రోజుల లాక్డౌన్ నుంచి తప్పించుకోవడానికి వైద్యునిగా దుస్తులు ధరించాలని నిర్ణయించుకున్నాడు. సెక్టార్ 35 సమీపంలో వైద్య వృతికి సంబంధించిన బట్టలు ధరించి, పరికరాలు పట్టుకుని ప్రశాంతంగా తిరుగుతున్నాడు. అతనిపై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు శర్మను ఆపి ప్రశ్నించారు. మొదట డాక్టర్ అని చెప్పాడు. తర్వాత అధికారులు మరిన్ని వివరాలు అడిగే సరికి నీళ్లునమిలాడు. దీంతో పోలీసులు అతను నకిలీ డాక్టర్ అని గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి, లాక్డౌన్ ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపారు.

ఢిల్లీ పొరుగున ఉన్న నోయిడాలో మూడు వారాల షట్ డౌన్ అమలుకు అధికారులు ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నారు. నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్‌లో గత 24 గంటల్లో ఏడు కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని, దీంతో జిల్లాలో మొత్తం కేసులు 45కి చేరుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. 99 శాతం మంది జాగ్రత్తలు పాటించి, మిగిలిన 1 శాతం మంది పాటించకపోతే, ఆ 1 శాతం మంది మొత్తం సమాజాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్ వై విలేకరులతో అన్నారు. ప్రభుత్వానికి, పరిపాలనకు మీ మద్దతు అవసరం, తాము పౌరులకు ఎలాంటి ఇబ్బందులను కలిగించబోమని భరోసా ఇస్తున్నామని చెప్పారు.

Also Read | తెలంగాణలో 127కు చేరిన కరోనా కేసులు…9 మంది మృతి