Gang Rape : బహిర్భూమికి వెళ్లిన వివాహితపై గ్యాంగ్ రేప్

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో కామాంధులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాలల్లో మార్పు రావడం లేదు. మహిళలకు రక్షణ లభించడం లేదు. దేశంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు..

Gang Rape : బహిర్భూమికి వెళ్లిన వివాహితపై గ్యాంగ్ రేప్

Gang Rape

Gang Rape : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో కామాంధులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాలల్లో మార్పు రావడం లేదు. మహిళలకు రక్షణ లభించడం లేదు. దేశంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్ద అని తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేదు. ఎప్పుడు ఏ కామాంధుడు వచ్చి అఘాయిత్యానికి ఒడిగడతాడో తెలీదు. తాజాగా రాత్రిపూట కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన మహిళపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

పూరీ జిల్లాలోని నిమపరా ప్రాంతంలో ఒక మహిళ(22) అర్ధరాత్రి బహిర్భూమికని నిర్మానుష్య ప్రదేశానికి వెచ్చింది. ఇది గమనించిన నలుగురు వ్యక్తులు ఆమెను వెంబడించారు. ఆ తర్వాత అదను చూసి ఆమెను టవల్ తో కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి బయటపడేందుకు ఆమె తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ ఆ కామాంధులు ఆమె వదలకుండా దారుణానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

Wife Harassment : భార్య వేధింపులతో బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం

బయటికి వెళ్లిన భార్య ఎంతసేపటికి రాకపోయేసరికి ఆమెను వెత్తుకుంటూ వెళ్లిన భర్తకు ఏడుస్తూ భార్య కనిపించడంతో కంగారుపడ్డాడు. ఏమైంది అని అడగ్గా ఆమె విషయం మొత్తం చెప్పింది. షాక్ కి గురైన భర్త కాసేపటికి కోలుకున్నాడు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నలుగురు వ్యక్తుల్లో ప్రధాన నిందితుడు బలరామ్ బోయ్ ని పోలీసులు గుర్తించారు. మిగతా వారిని అజిత్ దాస్, కన్హే బోయ్, బిద్యాదర్ స్వాన్ గా గుర్తించారు. వీరంతా బాధితురాలి పొరుగు ఊరికి చెందిన వారు.

Bride Escaped : కొద్ది గంటల్లో ముహూర్తం-పెళ్లి కూతురు అదృశ్యం

”రాత్రి 10 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాను. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉండటాన్ని గమనించిన బలరామ్, అతడి గ్యాంగ్ నన్ను పట్టుకున్నారు. నేను అరవకుండా బలరామ్ నా నోరు నొక్కి పట్టాడు. మిగతా ముగ్గురు అతడికి సహకరించారు. బలరామ్ అతడి ముగ్గురు స్నేహితులు రేప్ చేశారు” అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది.

ఈ నేరాన్ని మేము సీరియస్ గా తీసుకున్నాం. నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. నెల రోజుల్లో వారిపై కోర్టులో చార్జిసీట్ దాఖలు చేస్తాం. చట్ట ప్రకారం ఆ నలుగురిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని పూరీ ఎస్పీ కన్వర్ విశాల్ సింగ్ చెప్పారు.