హైదరాబాద్ లో దారుణం, సాయం కోసం వచ్చిన యువతిపై వృద్ధుడు అత్యాచారం

హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. సాయం కోసం తన దగ్గరికి వచ్చిన యువతిపై ఓ వృద్ధుడు

  • Published By: naveen ,Published On : May 10, 2020 / 07:02 AM IST
హైదరాబాద్ లో దారుణం, సాయం కోసం వచ్చిన యువతిపై వృద్ధుడు అత్యాచారం

హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. సాయం కోసం తన దగ్గరికి వచ్చిన యువతిపై ఓ వృద్ధుడు

హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. సాయం కోసం తన దగ్గరికి వచ్చిన యువతిపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. బాధిత యువతి (24) భర్తతో విడాకులు తీసుకొని ఫలక్‌నుమాలో ఉంటోంది. అలీబకర్‌ అనే వ్యక్తితో కొద్ది రోజులుగా సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరూ తమకు ఆర్థిక సాయం చేయాలని బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో ఉండే అలీబకర్‌ పెద్దమ్మ భర్త సలీముద్దీన్‌(80) దగ్గరికి ఏప్రిల్‌ 3న వెళ్లారు. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. తర్వాత మత్తులోకి జారుకున్న యువతిపై సలీముద్దీన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ ఘటనను అలీబకర్‌ తన ఫోన్‌తో రహస్యంగా వీడియో తీశాడు. ఇదిలా ఉండగా..తన ఇంట్లో ఖరీదైన హ్యాండ్ వాచ్ కనిపించడం లేదని అలీ బకర్‌తో పాటు యువతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 13న సలీముద్దీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరినీ పిలిచి విచారించారు. ఇదే సమయంలో తనకు జరిగిన అన్యాయం గురించి యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై సలీముద్దీన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని వాపోయింది. అలీబకర్‌ తీసిన వీడియోను శుక్రవారం బాధితురాలు పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సలీముద్దీన్‌పై ఐపీసీ 376, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.