Sexual Abuse On Dog : కుక్కపై లైంగిక దాడికి పాల్పడిన వృధ్దుడు

హర్యానాలోని  గురుగావ్‌లో దారుణం చోటు చేసుకుంది.  ఒక ఆడ కుక్కపై  67 ఏళ్ల వృధ్దుడు లైంగిక దాడి చేసిన ఘటన వెలుగు చూసింది.

Sexual Abuse On Dog : కుక్కపై లైంగిక దాడికి పాల్పడిన వృధ్దుడు

Dog Raped

Sexual Abuse On Dog : హర్యానాలోని  గురుగావ్‌లో దారుణం చోటు చేసుకుంది.  ఒక ఆడ కుక్కపై  67 ఏళ్ల వృధ్దుడు లైంగిక దాడి చేసిన ఘటన వెలుగు చూసింది.  సోహ్నా  ప్రాంతంలో నివసించే సురేష్ అనే 67 ఏళ్ల వృధ్దుడు తన పొరుగింటిలోని ఆడ కుక్కను తన ఇంటికి తీసుకువచ్చి దానిపై లైంగిక దాడి చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సురేష్‌కు  పొరుగింటిలో  ఉండే ముఖేష్ అనే వ్యక్తి   ఆడ, మగ కుక్కలను పెంచుతున్నాడు. సెప్టెంబర్ 28న రాత్రి సమయంలో ముఖేష్  ఇంటిలోని   ఆడ కుక్క కనిపించలేదు.  దీంతో ముఖేష్ కుక్కను వెదుకుతూ  సురేష్ ఇంటికి వచ్చాడు.  అక్కడ  జరుగుతున్న దృశ్యం  చూసి అవాక్కయ్యాడు.
Also Read : Baby Sale For Second Marriage : రెండో పెళ్లి కోసం నీచానికి దిగజారిన మహిళ

సురేష్ తన ఆడకుక్కతో అసహజ శృంగారానికి పాల్పడుతున్న దృశ్యం ముఖేష్  కంటపడింది. సురేష్ నిర్వాకాన్ని అతనికి తెలియకుండా సెల్ ఫోన్ లో వీడియో రికార్డు చేశాడు.  వాటి ఆధారంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  వృధ్ధుడు ఇలాంటి నీచానికి పాల్పడతాడని తాను ఊహించ లేదని ముఖేష్ అన్నాడు. ముఖేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు సురేష్ ను   అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.