Viral Video: వృద్ధురాలిని తాళ్ల‌తో క‌ట్టేసి కొట్టిన పొరుగింటివారు

ఓ వృద్ధురాలిని తాళ్ల‌తో క‌ట్టేసి కొట్టారు ముగ్గురు వ్య‌క్తులు. ఆమె కులాన్ని ప్ర‌స్తావిస్తూ దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఖర్గోన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: వృద్ధురాలిని తాళ్ల‌తో క‌ట్టేసి కొట్టిన పొరుగింటివారు

Viral Video

Viral Video: ఓ వృద్ధురాలిని తాళ్ల‌తో క‌ట్టేసి కొట్టారు ముగ్గురు వ్య‌క్తులు. ఆమె కులాన్ని ప్ర‌స్తావిస్తూ దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఖర్గోన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో పాటు మ‌రో వ్య‌క్తి పేరును ఎఫ్ఐఆర్ లో న‌మోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల‌పై దాడుల నిరోధ‌క చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశామ‌ని వివ‌రించారు. ఆ వృద్ధురాలి ఏ త‌ప్పూ చేయ‌కుండానే స్థానికులు ఆమెతో గొడ‌వ పెట్టుకున్నార‌ని పోలీసులు గుర్తించారు. వృద్ధురాలి కులాన్ని ప్ర‌స్తావిస్తూ తిట్టార‌ని చెప్పారు.

ఆ వృద్ధురాలు హీరాపూర్ గ్రామంలో ఒంటరిగా నివ‌సించేద‌ని చెప్పారు. ఆమె కుమారుడు ఇండోర్ లో కూలీగా ప‌నిచేస్తున్నాడ‌ని వివ‌రించారు. త‌మ ఇంటి ప‌క్క‌న నివ‌సించే గ‌ణేశ్ అనే వ్య‌క్తి త‌న ఇంటికి తాగి వ‌చ్చి త‌న‌ను తిట్టాడ‌ని ఆ వృద్ధురాలు తెలిపింది. అనంత‌రం అత‌డి భార్య, తల్లి కూడా వ‌చ్చి త‌న‌ను తిట్టింద‌ని వృద్ధురాలు చెప్పింది.

ఆ త‌ర్వాత త‌న‌ను ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు లాక్కెళ్లి క‌ట్టేసి కొట్టార‌ని వివ‌రించింది. ఇంత‌కు ముందు కూడా గ‌ణేశ్ త‌న‌ను చాలాసార్లు దూషించాడ‌ని బాధితురాలు చెప్పింది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కావ‌డంతో ఒంటరిగా గ్రామంలో ఉండ‌కూడ‌ద‌ని గ‌ణేశ్ తిట్టేవాడ‌ని తెలిపింది. కాగా, ఆమెను కొడుతుండ‌గా కొంద‌రు స్థానికులు కాపాడారు.