కొన్ని గంటల్లోనే : ప్రధాని మోడీ బంధువు పర్సు కొట్టేసిన దొంగ అరెస్ట్

ప్రధాని మోడీ సోదరుడి కుమార్తె దమయంతి బెన్ మోడీ పర్సు చోరీ చేసిన దొంగ దొరికాడు. చోరీ జరిగిన గంటల్లోనే ఢిల్లీ పోలీసులు దొంగను అరెస్టు చేశారు. ఆదివారం(అక్టోబర్

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 10:01 AM IST
కొన్ని గంటల్లోనే : ప్రధాని మోడీ బంధువు పర్సు కొట్టేసిన దొంగ అరెస్ట్

ప్రధాని మోడీ సోదరుడి కుమార్తె దమయంతి బెన్ మోడీ పర్సు చోరీ చేసిన దొంగ దొరికాడు. చోరీ జరిగిన గంటల్లోనే ఢిల్లీ పోలీసులు దొంగను అరెస్టు చేశారు. ఆదివారం(అక్టోబర్

ప్రధాని మోడీ సోదరుడి కుమార్తె దమయంతి బెన్ మోడీ పర్సు చోరీ చేసిన దొంగ దొరికాడు. చోరీ జరిగిన గంటల్లోనే ఢిల్లీ పోలీసులు దొంగను అరెస్టు చేశారు. ఆదివారం(అక్టోబర్ 13,2019) అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నోనుగా గుర్తించారు. దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు ముసుగు దొంగలు బైక్ పై వచ్చి తన వ్యాలెట్ లాక్కెళ్లిపోయారని దమయంతి బెన్ మోడీ శనివారం(అక్టోబర్ 12,2019) సివిల్ లైన్స్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. చోరీ జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది.

శనివారం ఉదయం దమయంతి బెన్ మోడీ అమృత్ సర్ నుంచి ఢిల్లీకి వచ్చారు. సివిల్ లైన్స్ ప్రాంతంలోని గుజరాతీ సమాజ్ భవన్ లో గది బుక్ చేసుకున్నారు. ఆటో దిగి గేటు దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు ముసుగు దొంగలు బైక్ పై వచ్చారు. దమయంతి చేతిలోని వ్యాలెట్ లాక్కెళ్లారు. పర్సులో రూ.56 వేల క్యాష్, 2 మొబైల్ ఫోన్లు, కీలకమైన డాక్యుమెంట్స్ ఉన్నాయని దమయంతి మోడీ తెలిపారు. శనివారం సాయంత్రమే గుజరాత్ వెళ్లాల్సి ఉంది.

కీలకమైన పత్రాలన్నీ పర్సులో ఉండిపోవడంతో గుజరాత్ కి వెళ్లలేకపోయాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసాలకు సమీప ప్రాంతంలోనే చోరీ జరగడం విశేషం. ప్రముఖుల నివాసాలు ఉండటంతో అక్కడ పోలీసుల బందోబస్తు, నిఘా ఎక్కువగా ఉంటుంది. అయినా స్నాచర్లు భయపడటం లేదు.

సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ఒకరిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే రెండో వాడిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఢిల్లీ వీధుల్లో బైక్ స్నాచర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. నిత్యం స్నాచింగ్ లు జరుగుతున్నాయి. బైక్ పై వస్తున్న దొంగలు రెప్పపాటులో చైన్లు, పర్సులు లాక్కెళ్లిపోతున్నారు. పోలీసులు నిఘా పెంచినా ఫలితం లేకుండా పోతోంది. చివరికి ప్రధాని మోడీ బంధువు పర్సు కూడా స్నాచర్లు కొట్టేయడం కలకలం రేపింది. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని నెలలుగా చైన్ స్నాచింగ్ కేసులు నమోదవుతున్నాయి. సెప్టెంబర్ 22న మహిళా జర్నలిస్ట్ గాయపడింది. ఆటో రిక్షాలో ఇంటికి వెళ్తుండగా స్నాచర్లు దాడి చేశారు. వారితో జరిగిన పెనుగులాటలో ఆమెకు గాయాలు అయ్యాయి.