Road Accident One Died : బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో ఓ కారు అదుపుతప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఒకరు కారులో ఇరుక్కుని మృతి చెందగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. జప్తి నాచారం మీదుగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పొదల మాటున ఉన్న వ్యవపాయ బావిలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

Road Accident One Died : బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

Road Accident One Died

Road Accident One Died : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో ఓ కారు అదుపుతప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఒకరు కారులో ఇరుక్కుని మృతి చెందగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. జప్తి నాచారం మీదుగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పొదల మాటున ఉన్న వ్యవపాయ బావిలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సిద్దిపేటకు చెందిన కనకయ్య, సిర్సనగండ్ల గ్రామానికి చెందిన వెంకటస్వామి సురక్షితంగా బయటపడ్డారు. కారులో వెళ్తున్న ముగ్గురిలో కనకయ్య, వెంకటస్వామి క్షేమంగా బయటపడినప్పటికీ యాదగిరి మాత్రం కారులోనే ఇరుక్కుపోవడంతో మృతి చెందాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి కారును బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. క్రేన్‌ సహాయంతో కారును బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అటు ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు ఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు కారును బయటకు తీస్తున్నారు.

Road Accident : కాలువలోకి దూసుకెళ్ళిన కారు.. ఇద్దరు మృతి
బావిలో పడ్డ కారును బయటకు తీసేందుకు పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఘటనా స్థలానికి భారీ క్రేన్లను తెప్పించి కారు వెలికితీసేందుకు యత్నిస్తున్నారు. కారులో ఇరుకున్న సూరంపేట గ్రామానికి చెందిన యాదగిరిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు మూడు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న యాదగిరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.