Gold Smuggling : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిలో బంగారం పట్టివేత

విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకు వస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Gold Smuggling : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిలో బంగారం పట్టివేత

Gold Smuggling : విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకు వస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 1196 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను శనివారం తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో వేరు,వేరు విమానాల్లో హైదరాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తుల వద్ద 1196 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు. ఒక వ్యక్తి బంగారం గొలుసుకు పూసలు వేసుకుని రాగా… మరోక వ్యక్తి బంగారం కడ్డీలను లోదుస్తుల్లో దాచుకుని తరలిస్తుండగా పట్టుకున్నారు.

ఇద్దరి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేపట్టారు. ఇద్దరి వద్ద పట్టుబడ్డ బంగారం విలువ సుమారు రూ.50 లక్షలకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.

Also Read : Gold Seized : ప్రయాణికుడి వద్ద నుంచి రెండు కిలోల బంగారం, 100 కిలోల వెండి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు