Accident : ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. పోలీసులు ఆపుతారన్న భయం నిండు ప్రాణం తీసింది

లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఆపుతారనే భయం, దానికి తోడు అంతులేని నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఓ నిండు ప్రాణం బలైపోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్‌ దగ్గర ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది.

Accident : ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. పోలీసులు ఆపుతారన్న భయం నిండు ప్రాణం తీసింది

Accident

Accident Caught On CCTV : లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఆపుతారనే భయం, దానికి తోడు అంతులేని నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఓ నిండు ప్రాణం బలైపోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్‌ దగ్గర ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది. అటవీశాఖ తనిఖీ కేంద్రం దగ్గర గేటు తగిలి బైక్ పై వెళ్తున్న ఓ యువకుడు చనిపోయాడు. లాక్‌డౌన్‌ వేళ పోలీసులు వాహనాన్ని ఆపుతారన్న భయంతో వేగంగా వెళ్లిన యువకుడు మిత్రుడి మృతికి కారణమయ్యాడు.

తపాల్ పూర్ దగ్గర ఫారెస్ట్ చెక్ పోస్టు ఉంది. లాక్ డౌన్ కావడంతో అధికారులు వాహనాలు అనుమతించడం లేదు. చెక్ పోస్టు దగ్గర గేటు వేశారు. అదే సమయంలో అటుగా ఓ వ్యక్తి బైక్ పై చాలా వేగంగా దూసుకొచ్చాడు. ఎదురుగా ఉన్న పోలీసులను చూసి భయపడ్డాడు. తనను ఆపుతారేమో అని కంగారు పడ్డాడు. ఆ కంగారులో బైక్ ని మరింత స్పీడ్ గా నడిపాడు. గేటు కింద నుంచి బైక్ ను పోనిచ్చాడు. ఫారెస్ట్ అధికారి ఆపాలని కోరాడు. అయినా అతడు వినిపించుకోలేదు.

ప్రమాదాన్ని ఊహించిన అధికారి.. గేటు ఎత్తి ప్రాణం కాపాడాలని ప్రయత్నించాడు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి గేటుకి బలంగా తగిలాడు. ఎగిరిపడ్డాడు. స్పాట్ లోనే అతడు ప్రాణాలు వదిలాడు. ఇంత జరిగినా వెనకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో చూడకుండా బైక్‌ రైడర్‌ వేగంగా వెళ్లిపోవడం గమనార్హం. కళ్ల ముందే జరిగిన ఘోర ప్రమాదం చూసి అధికారులు షాక్ కి గురయ్యారు.