నెల్లూరు కలెక్టరేట్ ముందు భార్యాపిల్లలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలతో వచ్చిన నాగార్జున అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 11:29 AM IST
నెల్లూరు కలెక్టరేట్ ముందు భార్యాపిల్లలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలతో వచ్చిన నాగార్జున అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలతో వచ్చిన నాగార్జున అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సైదాపురం ఎమ్మార్వో చంద్రశేఖర్ ప్రభుత్వ భూమికి పట్టా ఇస్తానని మోసం చేశాడని ఆరోపించారు. గతంలో చంద్రశేఖర్.. చిట్టమూరు ఎమ్మార్వోగా ఉండగా ప్రభుత్వ భూమికి పట్టా ఇస్తానని మోసం చేశాడని తెలిపారు. చిట్టమూరు పరిధిలో పలువురి నుంచి రూ.కోటి 20 లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. నాగార్జునను పోలీసులు, సిబ్బంది అడ్డుకున్నారు. 

చంద్రశేఖర్ సైదాపురం ఎమ్మార్వోగా పని చేస్తున్నారు. అయితే అతను గతంలో చిట్టమూరు ఎమ్మార్వోగా పని చేశారు. అప్పుడు చిట్టమూరు పరిధిలో ఉన్న కొందరు స్థానికులకు ప్రభుత్వ భూమికి సంబంధించి పట్టాలు ఇప్పిస్తానని చంద్రశేఖర్… తన ద్వారా పలువురి దగ్గర రూ.కోటి 20 లక్షలు వసూలు చేసి తీసుకున్నారని నాగార్జున ఆరోపిస్తున్నారు. అయితే పట్టాలు అయితే ఇవ్వలేదు. 

ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడం, చంద్రశేఖర్ ను చిట్టమూరు నుంచి గుంటూరుకు బదిలీ చేశారు. ఇటీవల చంద్రశేఖర్ కు మళ్లీ సైదాపురం ఎమ్మార్వోగా పోస్టింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి నాగార్జున.. భూమి పట్టాల గురించి ఎమ్మార్వో చంద్రశేఖర్ ను పలుమార్లు అడిగారు. అయితే అతని దగ్గరి నుంచి సరైన సమాధానం రాకపోవడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు న్యాయం కావాలని బుధవారం (ఫిబ్రవరి 5, 2020) ఉదయం కారులో భార్యాపిల్లలతో నాగార్జున కలెక్టరేట్ వద్దకు వచ్చాడు.

కారు దిగిన వెంటనే నాగార్జున తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకున్నాడు. నిప్పు అంటించుకోవడానికి ప్రయత్నించే లోపు భార్యాపిల్లలు పెద్దగా అరవడంతో అక్కడున్న స్థానికులు, పోలీసులు అడ్డుకుని, పెట్రోల్ బాటిల్ లాక్కొని, అతన్ని పక్కకు లాగేశారు. ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణం ఎమ్మార్వో చంద్రశేఖర్ అని బాధితుడు ఆరోపిస్తున్నాడు.