సోషల్ మీడియాలో పరిచయం..ముంబై రప్పించి సామూహిక అత్యాచారం

సోషల్ మీడియాలో పరిచయం..ముంబై రప్పించి సామూహిక అత్యాచారం

Online friend takes 13 year old Rajasthani girl to Mumbai, gang-rapes her with minor boy : సోషల్ మీడియాలో పరిచయం అయిన యువకుడ్ని కలవాటానికి 13 ఏళ్ళ బాలిక ఒంటరిగా జైపూర్ నుంచి ముంబై వెళ్ళింది. అక్కడ తన మరో మైనర్ స్నేహితుడితో కలిసి ఆ యవకుడు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. సోషల్ మీడియాలో ఎప్పడూ ఆన్ లైన్ లో ఉండటం వల్ల ఆ బాలిక రక్షించబడింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జైపూర్ కు చెందిన ఓ బాలిక(13) కు ఆన్ లైన్ లో ముంబైకు చెందిన యువకుడు సైఫ్ ఆలీఖాన్ (21) పరిచయం అయ్యాడు. రోజు చాటింగ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఒకరోజు నిన్ను చూడాలని ఉంది ముంబై రమ్మని… యువతిని కోరాడు ఆయువకుడు.

ఒకటికి రెండు సార్లు యువకుడు  ముంబై రమ్మని  కోరటంతో బాలికి ముంబైకి వెళ్లటానికి జైపూర్ నుంచి బయలు దేరింది.  ఆమెవద్ద డబ్బులు లేకపోవటంతో తన స్నేహితుడికి చెప్పింది.  వెంటనే అతను బస్సు కండక్టర్ నంబరు తీసుకుని అతనికి యూపీఐ ట్రాన్సఫర్ ద్వారా డబ్బులు చెల్లించాడు.  బాలిక ను సూరత్ లో దిగమని చెప్పారు.

ముంబైకి చెందిన యువకుడు సూరత్ వెళ్లి అక్కడి నుంచి బాలికను ముంబై  తీసుకువెళ్లాడు. అక్కడ కుర్లా లోని ఓ ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ మైనరైన మరో స్నేహితుడితో కలిసి మైనర్ బాలికపై  అత్యాచారం చేశాడు. మరో వైపు జైపూర్ లో బాలిక కనపడక పోవటంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బాలిక ఫోన్ సిగ్నల్స్  ఆధారంగా ఆ నెంబరు ముంబై లోని కుర్లా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. బాలిక ముంబై వెళ్లినా తన ఫోన్ ఆన్ చేసి ఉంచటం… సోషల్ మీడియాలో చాటింగ్ లో ఉండటంతో ఆమె ఉండే లోకేషన్  తేలికగా గుర్తించేందుకు సహాయ పడింది.  వెంటనే స్ధానిక  ముంబై  పోలీసులను రాజస్ధాన్ పోలీసులు  అలర్ట్ చేయటంతో వారు బాలికను ఉంచిన ఇంటికి చేరుకున్నారు.   మైనర్ బాలికను అక్కడ నిర్బంధించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, బాలికను రక్షించారు.  నిందితులిద్దరిపై  అత్యాచారం, కిడ్నాప్ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.