Sexual Harassment : జైలుకు పంపిందనే కక్షతో మహిళను కాల్చి చంపాడు

పెళ్లి చేసుకోమని వెంటపడి వేధించిన వ్యక్తిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆవ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Sexual Harassment : జైలుకు పంపిందనే కక్షతో మహిళను కాల్చి చంపాడు

Sexual Harassment

Sexual Harassment: పెళ్లి చేసుకోమని వెంటపడి వేధించిన వ్యక్తిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆవ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బైయిల్‌పై వచ్చిన ఆ వ్యక్తి తనను జైలుకు పంపిన మహిళను కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

సాగర్ జిల్లాలో నివసించే ఒక వ్యక్తి పొరుగింటి మహిళ(21)పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

కొద్దిరోజులక్రితం అతను బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఆ వ్యక్తి మహిళ ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు అతని చేతిల్ గన్ లాక్కుని పట్టుకునేందుకు ప్రయత్నించగా..వారిపై రాళ్లతో దాడి చేస్తూ పారిపోయాడు.

తుపాకీ కాల్పుల్లో గాయపడిన మహిళను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లువైద్యులు తెలిపారు. మహిళ సోదరి ఫిర్యాదుతో కేసునమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.