ప్రియాంకరెడ్డి కేసు: KTR ట్వీట్..సబితా..కలెక్టర్ పరామర్శ

  • Published By: madhu ,Published On : November 29, 2019 / 09:12 AM IST
ప్రియాంకరెడ్డి కేసు: KTR ట్వీట్..సబితా..కలెక్టర్ పరామర్శ

ప్రియాంకారెడ్డి ఘటనపై ట్విట్టర్‌లో స్పందించారు మంత్రి కేటీఆర్. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని.. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ జంతువుల్ని తెలంగాణ పోలీసులు కచ్చితంగా పట్టుకుంటారని చెప్పారు. త్వరలోనే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసును తానే పర్సనల్‌గా మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయాలని కోరారు మంత్రి కేటీఆర్.

శంషాబాద్‌లో నిన్న దారుణహత్యకు గురైన ప్రియాంకరెడ్డి  కుటుంబ సభ్యులను తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి పరామర్శించారు. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

నిన్న దారుణ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రాస్ పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ప్రియాంకరెడ్డి నివాసానికి వెళ్లి ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. తప్పు చేసిన వాళ్లకి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పిన ఆయన.. ప్రియాంకరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Read More : కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు
> ఇదిలా ఉంటే ప్రియాంకరెడ్డి హత్య కేసును 24 గంటల్లో చేధించారు పోలీసులు. 
> నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
> డ్రైవర్లు పాషా, నవీన్, క్లీనర్లు కేశవులు, శివలు అరెస్టయిన వారిలో ఉన్నారు.
> లారీ నెంబర్ (టీఎస్ 07యూఏ 3335) ద్వారా నిందితులను పట్టుకున్నారు. 
> నిందితులు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారీగా గుర్తించారు. 
> ప్రధాన నిందితుడు ఎండీ పాషాగా గుర్తించారు. 
> ప్రియాంకపై నిర్మానుష్య ప్రాంతంలో లారీ డ్రైవర్, క్లీనర్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. 
> లారీ రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిగా గుర్తించారు. 
> నిందితులు వాడిన లారీపై 4 పెండింగ్ చలాన్లు ఉన్నాయి.
> రాంగ్ పార్కింగ్, నో ఎంట్రీ, ర్యాష్ డ్రైవింగ్ కింద చలాన్లున్నాయి.