1.5 లక్షల ఫేక్ ట్విట్టర్ అకౌంట్లతో ‘మహా’ ప్రభుత్వంపై దుష్ప్రచారం : ముంబై పోలీసులు

  • Published By: sreehari ,Published On : November 4, 2020 / 08:24 AM IST
1.5 లక్షల ఫేక్ ట్విట్టర్ అకౌంట్లతో ‘మహా’ ప్రభుత్వంపై దుష్ప్రచారం : ముంబై పోలీసులు

Fake Twitter Accounts : మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు 1.5 లక్షల ఫేక్ ట్విట్టర్ అకౌంట్లను వాడినట్టు గుర్తించామని ముంబై పోలీసులు వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేందుకు ఈ ఫేక్ ట్విట్టర్ అకౌంట్లను విదేశాల నుంచి ఆపరేట్ చేసినట్టు సైబర్ నిపుణుల నివేదిలో వెల్లడైందని నగర పోలీసులు పేర్కొన్నారు.



విదేశాల నుంచి నకిలీ ట్విట్టర్ అకౌంట్లతో పాటు కొన్నింటిని బాట్స్ ద్వారా నిర్వహించినట్టు విచారణలో తేలింది. రాజ్ పూత్ ఆత్మహత్య విషయంలో చాలా నకిలీ ట్విట్టర్ అకౌంట్లలో తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసినట్టు గుర్తించామన్నారు.
https://10tv.in/how-to-save-ourselves-from-fake-calls-and-fake-apps/
అందులో ఎక్కువగా బాట్స్ (సాఫ్ట్ వేర్ ప్రొగ్రామ్స్ ఉపయోగించి) ద్వారా ట్వీట్లను రీట్వీట్లు చేసినట్టు సైబర్ నివేదిక పేర్కొంది. భారత్ పొరుగు దేశాలైన చైనా, పనామా, హాంగ్ కాంగ్, నేపాల్ నుంచి ఈ ఫేక్ అకౌంట్లను ఆపరేట్ చేసినట్టు గుర్తించారు.



కొన్ని ఫేక్ ట్విట్టర్ అకౌంట్లను యూజర్ ఐడెండెటీ గుర్తించకుండా ఉండేలా ప్రాక్సీ సర్వర్ల ద్వారా భారతదేశంలో నుంచే ఆపరేట్ చేసినట్టు సైబర్ నిపుణులు నిర్ధారించారు. దాదాపు 1.5 లక్షల నకిలీ ట్విట్టర్ అకౌంట్లతో పాటు 1000 వరకు బాట్స్ ద్వారా నిర్వహించినట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.

గత జూన్ నెలలో రాజ్ పూత్ మరణించిన వెంటనే కొన్ని కొత్త ట్విట్టర్ అకౌంట్లలో మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులకు వ్యతిరేకంగా తప్పుడు పోస్టులతో దుష్ప్రచారం మొదలయిందని సైబర్ నివేదిక పేర్కొంది. సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుల పేర్లతో ట్విట్టర్ ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి వేర్వేరు హ్యాష్ ట్యాగులను వాడినట్టు రిపోర్టులో తేలింది.



కనీసం 19 హ్యాష్ ట్యాగుల్లో JusticeforSSR, ParamBirScam, ParamBirSinghResign, SanjayRaut, Officeof UT, AUThackeray, BabyPenguin లను వాడినట్టు సైబర్ విచారణ బృందంతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించరు. ఈ ఫేక్ ట్విట్టర్ అకౌంట్లను డిలీట్ లేదా నెగటివ్ పోస్టులను తొలగించినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు.