Tihar jail Full : ఖైదీలతో కిక్కిరిసిపోయిన తీహార్ జైలు .. హ్యాండిల్ చేయలేక తల పట్టుకుంటున్న జైలు సిబ్బంది

దేశంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. దేశంలోనూ ప్రతి మూలా, ప్రతి నిమిషం ఏదో ఒక క్రైమ్‌ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ఖైదు చేయడానికి జైళ్లు కూడా సరిపోవడం లేదు. ఇప్పుడు తిహార్‌ జైలు పరిస్థితి అలానే ఉంది. దేశంలోని కరుడు గట్టిన నేరస్తులకు ఇది కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే తీహార్ జైలులో ఖైదీలతో కిక్కిరిపోయింది. దీంతో ఖైదీలను హ్యాండిల్ చేయలేక జైలు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

Tihar jail Full :  ఖైదీలతో కిక్కిరిసిపోయిన తీహార్ జైలు .. హ్యాండిల్ చేయలేక తల పట్టుకుంటున్న జైలు సిబ్బంది

Overcrowding at Tihar jail makes difficult for officials to monitor inmates

Tihar Jail is full of prisoners :  దేశంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. దేశంలోనూ ప్రతి మూలా, ప్రతి నిమిషం ఏదో ఒక క్రైమ్‌ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ఖైదు చేయడానికి జైళ్లు కూడా సరిపోవడం లేదు. ఇప్పుడు తిహార్‌ జైలు పరిస్థితి అలానే ఉంది. దేశంలోని కరుడు గట్టిన నేరస్తులకు ఇది కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి జైలులో ఇప్పుడు స్థాయికి మించి నేరస్తులు ఉన్నారు. ప్రస్తుతం తిహార్ జైలులో వాస్తవ సామర్థ్యం కంటే రెండున్నర రెట్లు ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. నిరంతరం వీరందరినీ పర్యవేక్షించడం జైలు సిబ్బందికి తలకు మించిన భారంలా మారుతోంది.

Also read : Inmate Boyfriend Murder With Lip Kiss : జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రియుడికి లిప్ కిస్ ఇచ్చిన యువతి .. కాసేపటికే చనిపోయిన బాయ్ ఫ్రెండ్

తీహార్‌ జైలు పేరు వింటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే దేశంలోని కరుడుగట్టిన నేరస్తులంతా ఉండేది ఇక్కడే..! అందుకే ఈ జైలు లోపల బయట హై సెక్యూరిటీ ఉంటుంది. నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంటుంది. దారుణమైన నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులు మొదలుకొని పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్ర వాదులకు ఇదే కేరాఫ్‌ అడ్రస్. నేరాలు రుజువు కావడంతో ఎంతో మందిని ఇక్కడే ఉరితీశారు. అలాంటి జైలు ఇప్పుడు హౌస్‌ఫుల్‌ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే స్థాయికి మించి ఖైదీలున్నారు. ప్రస్తుతం వాస్తవ సామర్థ్యం కంటే రెండున్నర రెట్లు ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. తీహార్ భారాన్ని తగ్గించడానికి వరుసగా 2004, 2016లో నిర్మించిన ఇతర జైలు సముదాయాలు.. రోహిణి, మండోలిలో కూడా ఇదే సమస్య కనిపిస్తోంది. ఢిల్లీలో మూడు జైలు సముదాయాలు ఉన్నాయి. అందులో ఒకటి తీహార్, రెండోది రోహిణి మూడోది మండోలి.. ఈ మూడింట్లోనూ ఖైదీలు కిక్కిరిసిపోయారు.

Also read : Gang war in Prison: జైలులో గ్యాంగ్‌ వార్‌..116కు చేరిన మృతులు

ప్రపంచంలోని అతిపెద్ద జైళ్లలో తీహార్ కూడా ఒకటి. ఇది తొమ్మిది కేంద్ర కారాగారాలను కలిగి ఉంది. తీహారు జైలు సామర్థ్యం ప్రకారం అందులో 5,200 మంది ఖైదీలు సరిపోతారు. అయితే ప్రస్తుతం తొమ్మిది సెంట్రల్‌ జైళ్లలో 13,183 మంది ఖైదీలు ఉన్నారు. ఆరు సెంట్రల్ జైళ్లు ఉన్న మండోలిలో 1,050 మంది కెపాసిటీ ఉండగా, ప్రస్తుతం 2,037 మంది ఖైదీలు ఉన్నారు. అదే ఒకే ఒక్క సెంట్రల్ జైలు ఉన్న రోహిణి కెపాసిటీ 3,776 మంది ఖైదీలు. కానీ ప్రస్తుతం అక్కడ 4,355 మంది ఖైదీలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఖైదీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ జైళ్లలో హై-ప్రొఫైల్ గ్యాంగ్‌స్టర్లు ఇతర నేరస్థులు కూడా ఉన్నారు. మొత్తం 16 జైళ్లలో 10,026 మందికి మించి ఖైదీలను ఉంచడం రిస్క్‌తో కూడుకున్న విషయం. కానీ ప్రస్తుతం సామర్థ్యానికి మించి 19,500 మంది ఖైదీలుగా ఉన్నారు. వీరందరినీ హ్యాండిల్‌ చేయడం జైలు సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ కనిపిస్తోంది.

Also read : Israel : జైల్లో ఉన్న సమయంలోనే ఆలూ చిప్స్ సహాయంతో..నలుగురు బిడ్డలకు తండ్రి అయిన ఖైదీ

జైలు అంటే తరుచూ ఏవో ఒక వివాదాలు జరుగుతుంటాయి. అందులోనూ అక్కడున్న వారంతా కరుడు గట్టిన నేరస్తులు కావడంతో… ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం పరిపాటి. అందులోనూ ఇప్పుడు సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉండడంతో వారిని అదుపు చేయడం అక్కడి సిబ్బంది వల్ల కావడం లేదు. పారిశ్రామిక వేత్తలను బెదిరించి వందల కోట్లు వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్, ఒలింపిక్ రజత పతక విజేత సుశీల్ కుమార్, కోర్టు ఆదేశాలతో తాజాగా తీహార్ నుండి మండోలీకి తరలించిన కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్.. ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఇప్పుడు తీహార్‌లో ఉన్న కరుడుగట్టిన నేరస్తులను వేరే చోటుకి తరలించలేరు.. అలాగని అక్కడ కూడా ఉంచలేకపోతున్నారు. దీంతో ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులకు అర్థం కావడం లేదు.