వీడో సైకో డాక్టర్ : 900 మంది చిన్నారులకు HIV అంటించాడు!

  • Published By: sreehari ,Published On : October 31, 2019 / 08:03 AM IST
వీడో సైకో డాక్టర్ : 900 మంది చిన్నారులకు HIV అంటించాడు!

వైద్యుడు దేవుడితో సమానం అంటారు. కానీ డాక్టర్ రూపంలో ఉన్న రాక్షసుడు. అభుం శుభం తెలియని చిన్నారులకు అన్యాయంగా హెచ్ఐవీ అంటించాడు. వాడి పడేసిన సిరంజీలను మళ్లీ మళ్లీ వాడుతూ చంటి పిల్లలను హెచ్ఐవీ బాధితులుగా మార్చేశాడు. ఇప్పటివరకూ 900 మంది చిన్నారులకు హెచ్ఐవీ సోకినట్టు తేలింది. దీంతో పాకిస్థాన్ లోని రాటోడెరో నగరంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఒక వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే వందలాది పిల్లలు హెచ్ఐవీ బారిన పడ్డారు. ఈ ఏడాదిలో వైద్యాధికారులు నిర్వహించిన పరీక్షల్లో 9వందల మంది చిన్నారులకు HIV సోకినట్టు నిర్ధారించారు. హెచ్ఐవీ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ప్రస్తుతం.. 1,100 మందికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా.. వారిలో హెచ్ఐవీ సోకిన 900 మంది చిన్నారులు 12ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారే ఉన్నారు. ఇప్పటివరకూ మొత్తంగా 2లక్షల మందికి హెచ్ఐవీ టెస్టులు నిర్వహించినట్టు రిపోర్టులు వెల్లడించాయి. దీనికంతటికి ముజప్ఫర్ ఘాగ్రో అనే పిడియాట్రీషియన్ కారణం. ఎందుకంటే.. తన క్లినిక్ దగ్గరకు వచ్చే చిన్నారులకు కేవలం రూ. 14లు (పాకిస్థానీ కరెన్సీలో 31 రూపాయలు) ఫీజు తీసుకుని హెచ్ఐవీ వైరస్ సిరంజీలను వాడేవాడు. నగరంలో అతి తక్కువ ఫీజు తీసుకునే వైద్యుల్లో ఇతడు ఒక్కడే కావడంతో పేదవారంతా ఎక్కువ సంఖ్యలో ఇక్కడి క్లినిక్ కు తరలివచ్చేవారు. 

ఇటీవల హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన సమయంలో హెచ్ఐవీ పాజిటీవ్ గా తేలిన వారంతా మోసగాడి క్లినిక్ నుంచి చికిత్స తీసుకున్నవారేనని విచారణలో తేలింది. క్లినిక్ కు వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ వైద్యుడ్ని అరెస్ట్ చేశారు. కానీ, తనపై వచ్చిన ఆరోపణలను అతడు ఖండించడమే కాకుండా తాను అమాయకుడినని, తనకు ఏపాపం తెలియదని వాదిస్తున్నాడు. తనపై ఇంకా నేరం రుజువు కావాల్సి ఉండగా, నగరంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ పిడియాట్రీషియన్గా పనిచేస్తున్నట్టు రిపోర్టు తెలిపింది. మరోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఇలాంటి వైద్యుడ్ని కఠినంగా శిక్షించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.