Pastor Assaults : చర్చికి వచ్చే యువతులపై పాస్టర్ లైంగికదాడి..మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసం

హైదరాబాద్ లో ఓ కీచక పాస్టర్ బాగోతం బయటపడింది. మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసానికి పాల్పడ్డారు. చర్చికి వస్తున్న ఆడపిల్లపై లైంగిక వాంఛలు తీర్చుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

Pastor Assaults : చర్చికి వచ్చే యువతులపై పాస్టర్ లైంగికదాడి..మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసం

Pastor

Pastor sexually assaults : హైదరాబాద్ ఉప్పల్ లో ఓ కీచక పాస్టర్ బాగోతం బయటపడింది. మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసానికి పాల్పడ్డారు. ఉప్పల్ లోని గాస్పల్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న జోసఫ్‌ అలియాస్ సాధు.. మత ప్రభోదకుడి ముసుగులో యువతులకు గాలం వేస్తున్నాడు.

చర్చికి వస్తున్న అమాయక ఆడపిల్లలను టార్గెట్‌గా చేసుకుని లైంగిక వాంఛలు తీర్చుకుంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. మరోవైపు అతడు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కీచక పాస్టర్ బారినపడిన ముగ్గురు బాధిత యువతులతోపాటు, ఎమ్మార్పీఎస్ నాయకులు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కీచక పాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.