Birthday Celebrations : బర్త్ డే వేడుకలు చేసుకున్న యువకులు.. అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసులు, అసలేం జరిగిందంటే..

Birthday Celebrations : పుట్టిన రోజును బంధువులు, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం కామన్. కానీ, ఎక్కడ పడితే అక్కడ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటామంటే పోలీసులు ఊరుకుంటారా ఏంటి?

Birthday Celebrations : బర్త్ డే వేడుకలు చేసుకున్న యువకులు.. అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసులు, అసలేం జరిగిందంటే..

Birthday Celebrations(Photo : Google)

Birthday Celebrations : అదేంటి.. బర్త్ డే వేడుకలు చేసుకోవడం ఏమైనా నేరమా? ఆ మాత్రానికి అరెస్ట్ చేయడాలు, జైల్లో వేయడాలు ఏంటి? అనే అనుమానం వచ్చింది కదూ. ఈ సందేహం రావడంలో తప్పు లేదు. అవును నిజమే.. పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. దానికి కారణం లేకపోలేదు. వాళ్లు బర్త్ డే సెలబ్రేషన్ చేసుకున్నది ఎక్కడో తెలుసా? ఎలివేటేడ్ రోడ్డుపై. అదీ విషయం. అందుకే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

పుట్టిన రోజును బంధువులు, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం కామన్. కానీ, ఎక్కడ పడితే అక్కడ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటామంటే పోలీసులు ఊరుకుంటారా ఏంటి? ఇంట్లోనో, ఫంక్షన్ హాల్ లోనో సెలబ్రేట్ చేసుకుంటే ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎవరూ తప్పు పట్టరు. కానీ, ఇలా నడిరోడ్డుపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే పోలీసులు ఎందుకు సైలెంట్ గా ఉంటారు చెప్పండి.

Also Read..Road Accident : షాకింగ్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం, రోడ్డుపై కారు బీభత్సం

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో జరిగింది. ఘజియాబాద్ లోని ఎలివేటేడ్ రోడ్ పై కొంతమంది యువకులు కలిసి బర్త్ డే పేరుతో రచ్చ రచ్చ చేశారు. నడిరోడ్డుపై బైకులు పార్క్ చేశారు. అక్కడే కేక్ కూడా కట్ చేశారు. అంతేనా, క్రాకర్స్ కూడా పేల్చారు. ఇలా పబ్లిక్ ప్లేస్ లో నాన్స్ సెన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం పోలీసులకు తెలిసింది. అంతే, వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఏడుగురు యువకులను అరెస్ట్ చేసి అత్తారింటికి పంపారు. వారిలో బర్త్ డే బాయ్, అతడి స్నేహితులు ఉన్నారు.

ఎలివేటేడ్ రోడ్డుపై ఎలాంటి సెలబ్రేషన్స్ కు పర్మిషన్ లేదు. పైగా టైట్ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అక్కడ పిచ్చి పనులు చేయనివ్వరు. అలాంటి ప్లేస్ లో వీళ్లు ఏకంగా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం పోలీసులకు కోపం తెప్పించింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో వీరి హంగామాను కంట్రోల్ రూమ్ లోని స్క్రీన్ పై పోలీసులు చూశారు. ఒక్క సెకన్ షాక్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్పాట్ కి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై ఎక్కడిపడితే అక్కడ బైకులు పార్క్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు యువకులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎలివేటేడ్ రోడ్డుపై ఎలాంటి పార్టీలో చేసుకోవడానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

Also Read..Ghaziabad Manhole : షాకింగ్ వీడియో.. అంతా చూస్తుండగానే, నడుస్తూ నడుస్తూ మ్యాన్ హోల్‌లో ఎలా పడిపోయారో చూడండి

కాగా, గతంలో ఈ ఎలివేటేడ్ రోడ్డుపై చాలామంది రకరకాలుగా హంగామా చేశారు. సెలబ్రేషన్స్ పేరుతో రచ్చ రచ్చ చేశారు. ఎక్కడ పడితే అక్కడ బైకులు ఆపడం, కేక్ లు కట్ చేయడం, రీల్స్ చేయడం.. ఇలా నానా రచ్చ చేశారు. ఈ క్రమంలో ఓ రోజు యాక్సిడెంట్ జరిగింది. దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అప్పటి నుంచి ఎలివేటేడ్ రోడ్డుపై ఎలాంటి వేడుకలు చేసుకోరాదని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు, నిఘా కోసం నలుగురు పోలీసులను అక్కడ డ్యూటీలో పెట్టారు.