దిశ ఘటనపై అసభ్యకర కామెంట్లు : స్మైలీ నాని అరెస్ట్

దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టిన యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న(డిసెంబర్ 3,2019) శ్రీరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 12:44 PM IST
దిశ ఘటనపై అసభ్యకర కామెంట్లు : స్మైలీ నాని అరెస్ట్

దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టిన యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న(డిసెంబర్ 3,2019) శ్రీరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టిన యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న(డిసెంబర్ 3,2019) శ్రీరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ(డిసెంబర్ 4,2019) గుంటూరుకి చెందిన స్మైలీ నానిని అదుపులోకి తీసుకున్నారు.అతడిని గుంటూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు.

స్మైలీ నానిని పోలీసులు విచారిస్తున్నారు.ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ కు చెందిన శ్రీరామ్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దిశ ఉదంతంపై స్టాలిన్ శ్రీరామ్ పేరుతో దుష్ప్రచారం చేశాడు. ఫేస్ బుక్ లో అనుచిత పోస్టులు పెట్టాడు. అసభ్యకర రాతలు రాశాడు.

దీనిపై తీవ్ర నిరసనలు రావడంతో.. సుమోటోగా స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. రంగంలోకి దిగి శ్రీరామ్ ని గుర్తించి అరెస్ట్ చేశారు. సైబర్ నేరాలకు చెందిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శాడిజానికి పరాకాష్టగా చెప్పుకునే ఉదంతం ఇది. శంషాబాద్ దగ్గర వెటర్నరీ డాక్టర్ దిశ.. నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్యాచారం, హత్యకు గురి కావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందరిని కంటతడి పెట్టించింది.

ఈ దారుణ ఘటనకు కారణమైన నలుగురిని బహిరంగంగా ఉరి తీయాలంటూ దేశం మొత్తం నినదిస్తున్న వేళ.. కొందరు నీచులు మాత్రం మానవత్వాన్ని మరిచారు. విలువలు మరిచి ప్రవర్తించారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశారు. దిశ ఘటనను అశ్లీలంగా, అసభ్యకర దృష్టి కోణంలో చూశారు.

సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టి తమలోని పైశాచికత్వాన్ని చాటుకున్నారు. అలాంటి వారిని గుర్తించి మరీ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మానవత్వం మర్చిపోయిన ఇలాంటి దుర్మార్గులను ఏం చేసినా పాపం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.