Police Arrested Man killed Rat : ఎలుకను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఓ ఎలుకను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. మనుషులను చంపినవారిని అరెస్ట్ చేయటానికే దిక్కులేదు ఎలుకను చంపితే అరెస్ట్ చేస్తారా?అని అనుకుంటున్నారా? కానీ అదే జరిగింది.ఎలుకను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేయటమేకాకుండా పోలీసులు ఆ ఎలుక కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించటం మరో విశేషం.

police arrested man killed rat : ఓ ఎలుకను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. మనుషులను చంపినవారిని అరెస్ట్ చేయటానికే దిక్కులేదు ఎలుకను చంపితే అరెస్ట్ చేస్తారా?అని అనుకుంటున్నారా? కానీ అదే జరిగింది ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో. ఓ ఎలుకను హింసించి మరీ హత్య చేశాడో వ్యక్తి. అతనిని అరెస్ట్ చేయటంతో ఈ ఎలుక హత్య విషయం చర్చనీయాంశమైంది యూపీలో. ఎలుకను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేయటమేకాకుండా పోలీసులు ఆ ఎలుక కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించటం మరో విశేషం.

ఈ వింత ఘటన వివరాల్లోకి వెళితే..రోడ్డు పక్కన మురికి కాలువ కల్వర్టుపై మనోజ్ కుమార్ అనే వ్యక్తి కూర్చున్నాడు. కూర్చున్నవాడు కుదురుగా ఉండగా అతని పక్కగా వెళుతున్న ఓ ఎలుకను పట్టుకున్నాడు. అక్కడితో ఊరుకోలేదు.ఆ ఎలుక తోకకు రాయి కట్టి ఆ మురికి కాలువలో పడేశాడు. అదేసమయంలో అటుగా వెళుతున్న వికేంద్ర శర్మ ఎలుకకు రాయి కడుతుంటం చూశాడు. ఏయ్ ఏం చేస్తున్నావ్..మనిషివేనా..అలా చేయొద్దు పాపం అంటూ మందలించాడు. కానీ మనోజ్ మాత్రం తను చేసే పని ఆపలేదు. ఆ ఎలుకకు ఓ రాయి కట్టి అతని కళ్ల ముందే ఎలుకను కాలువలోకి విసిరాడు.

దీంతో వికేంద్ర శర్మకు కోపం వచ్చింది.నువ్వసలు మనిషివేనా అని తిడుతూ మురికి కాలువలో పారేసిన ఎలుకను బయటకు తీశాడు. కానీ పాపం అది అప్పటికే చనిపోయింది.దీంతో వికేంద్ర శర్మకి కోపం వచ్చి.. మనోజ్ కుమార్ ను అలా దారుణంగా ఎలా చేయాలనిపించింది అని ప్రశ్నించాడు.దానికి మనోజ్ నేను ఎలుకలను ఇలా చంపేస్తానని.. వాటిని చంపుతూనే ఉంటానని.. నీకు దమ్ముంటే ఏం చేస్తావో చేస్కో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో వికేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎలుకకు పోస్టుమార్టం నిర్వహించాలని, నిందితుడిపై జంతు హింస చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బదౌన్ పోలీసులు ట్వీట్ చేశారు. ‘చనిపోయిన ఎలుకను పోస్ట్ మార్టం కోసం.. బదౌన్‌లోని వెటర్నరీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కు పంపామని పోలీసులు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు