Congress MLAs Arrest : కారులో భారీగా డబ్బు తరలిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరెస్ట్

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి నోట్ల కట్టల బ్యాగులు బయటపడ్డాయి. ఈ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనీతో పట్టుబట్టారు. కారులో భారీగా డబ్బును తరలిస్తున్న ముగ్గురు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌ హౌరాలో వీరిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Congress MLAs Arrest : కారులో భారీగా డబ్బు తరలిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరెస్ట్

Congress MLAs Arrest : పశ్చిమ బెంగాల్‌లో మరోసారి నోట్ల కట్టల బ్యాగులు బయటపడ్డాయి. ఈ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనీతో పట్టుబట్టారు. కారులో భారీగా డబ్బును తరలిస్తున్న ముగ్గురు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌ హౌరాలో వీరిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్‌ కశ్యప్‌, నమన్ బిక్సల్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

డబ్బును క్యాష్‌ మెషిన్‌తో లెక్కిస్తున్నారు. ఎంత మనీ ఉందో తెలియాల్సి ఉంది. ఇక డబ్బును తరలిస్తున్న టయోటా ఎస్‌యూవీ కారు జమ్‌తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీదిగా గుర్తించారు. రాజేశ్ ప్రస్తుతం కిజ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక బిక్సల్‌…కోల్‌బిరా నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బెంగాల్‌లో పార్థా చటర్జీ టీచర్స్ స్కామ్‌లో ఇప్పటికే కోట్లలో నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు.

Heavy Cash Seize : ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.5 కోట్లు పట్టివేత

ఈ సమయంలో జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బులున్న బ్యాగులతో బెంగాల్‌లో పట్టుబడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇప్పటికే బెంగాల్‌లో బీజేపీ…టీఎంసీ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తోందంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్‌, బెంగాల్‌లో ప్రభుత్వాలు మారిపోతాయని బీజేపీ నేతలు గతంలో చేసిన కామెంట్లను గుర్తు చేస్తున్నారు.