సినీ నటికి వాట్సప్ వీడియోకాల్ చేసి లైంగికంగా వేధించిన యువకుడు

సినీ నటికి వాట్సప్ వీడియోకాల్ చేసి లైంగికంగా వేధించిన యువకుడు

Police book man for making lewd video calls to movie actress : ఒక సినీనటి కి వాట్సప్ వీడియోకాల్ చేసి లైంగికంగా వేధించిన యువకుడిపై ముంబై లో కేసు నమోదైంది. ఈమేరకు సినీ నటి(32) వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 11వ తేదీ శుక్రవారం నాడు గుర్తు తెలియని యూకే నెంబర్ నుంచి తనకు రెండు సార్లు వాట్సప్ వీడియో కాల్ వచ్చిందని ఆ నటి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కోంది. రెండు సార్లు ఫోన్ కట్ చేసిన సినీ నటి మూడవ సారి వచ్చినప్పుడు అనుకోకుండా కాల్ లిఫ్టు చేసింది.

ఆసమయంలో అవతలి వ్యక్తి వీడియో కాల్ లో హస్త ప్రయోగం చేసుకుంటూ కనిపించాడు. ఆ దృశ్యాలను చూసిన నటి షాక్ కు గురయ్యింది. వెంటనే తేరుకుని అతడి చర్యలను స్క్రీన్ షాట్లను తీసింది. వీడియో కాల్ అయిన తర్వాత తన చర్యను సమర్ధించుకుంటూ… సినీ నటిని సంభోధిస్తూ వెకిలి మెసేజ్ లు పంపించాడు. ఆ నటి వాటిని కూడా వెంటనే స్క్రీన్ షాట్లు తీసింది. ఈ చర్యలతో కోపోద్రిక్తురాలైన నటి అతడికి గట్టిగానే సమాధానం చెప్పింది.

తాను తీసిన స్క్రీన్ షాట్లు అతనికి పింపిస్తూ ముంబై నగర పోలీసు కమీషనర్ కు ట్యాగ్ చేసింది. దీంతో హడలి పోయిన యువకుడు ప్రమాదంలో పడ్డానని గుర్తించాడు. సినీ నటికి క్షమాపణలు చెప్పాడు. తాను విదేశాల్లో చదువుకుంటున్న 20 ఏళ్ళ యువకుడినని…తానుపంపిన మెసేజ్ లు వీడియో కాల్స్ తన స్నేహితురాలికి చేయబోతే మీకు వచ్చిందంటూ మాట మార్చాడు. అతని మాటలు నమ్మశక్యంగా లేకపోవటంతో ముంబైలోని వెర్సోవా పోలీసులకుఫిర్యాదు చేసింది.

యూకే నెంబరు నుంచి వచ్చిన యువకుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 354ఏ, 509, తోపాటు ఐటీ సెక్షన్ 67ఏ కింద కేసు నమోదు చేశారు. నిందితుడు విదేశాల్లోఉన్నందున తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కాగా…. గతేడాది కూడా తన ఫోన్ కు ఇలాంటి గుర్తు తెలియని 8 నెంబర్లు నుంచి లైంగిక వేధింపులు వచ్చాయని..వాటిపై అప్పుడే కేసు నమోదుచేసినట్లు తాజా ఫిర్యాదులో పేర్కోనడం గమనార్హం.