BJP Shailendra : గుట్కా దందాలో సీఎం అత్యంత సన్నిహితుడు, బీజేపీ సీనియర్ నేత హస్తం..!

తెలంగాణలో తీగ లాగితే కర్నాటకలో డొంక కదులుతోంది. రాష్ట్రంలో తరుచూ పట్టుబడుతున్న గుట్కా దందాలో కర్నాటక బీజేపీ సీనియర్ నాయకుడు శైలేంద్ర హస్తం ఉన్నట్లు తెలిసింది.

BJP Shailendra : గుట్కా దందాలో సీఎం అత్యంత సన్నిహితుడు, బీజేపీ సీనియర్ నేత హస్తం..!

Bjp Shailendra

BJP Shailendra : తెలంగాణలో తీగ లాగితే కర్నాటకలో డొంక కదులుతోంది. రాష్ట్రంలో తరుచూ పట్టుబడుతున్న గుట్కా దందాలో కర్నాటక బీజేపీ సీనియర్ నాయకుడు శైలేంద్ర హస్తం ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో బీజేపీ నేత శైలేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో శైలేంద్రతో పాటు బీజేపీకి చెందిన మరో ముఖ్య నాయకుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కర్నాటక నుంచి పెద్ద మొత్తంలో గుట్కా తయారీదారులకు మద్దతిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బీదర్ నుంచి వస్తున్న మాఫియాకు కర్నాటక బీజేపీ సీనియర్ నేత శైలేంద్ర అండగా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్దఎత్తున గుట్కా మాఫియా నడుపుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. కర్నాటక ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు శైలేంద్ర. కర్నాటక సీఎం యడియూరప్పకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు.

షాహినాయత్ గంజ్ పీఎస్ పరిధిలో భారీ ఎత్తున్న గుట్కా పట్టుబడగా.. ఈ కేసులో విచారణకు రావాలని బీదర్ కు చెందిన ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.