ఒకే ఒక్కడు.. సింగిల్‌గా బైకు దొంగల ఆట కట్టించిన కానిస్టేబుల్‌

  • Published By: sreehari ,Published On : October 21, 2020 / 03:32 PM IST
ఒకే ఒక్కడు.. సింగిల్‌గా బైకు దొంగల ఆట కట్టించిన కానిస్టేబుల్‌

bike thieves:సింగిల్‌గా వెళ్లి బైక్ దొంగల ముఠా ఆట కట్టించాడో చెన్నైకి చెందిన పోలీసు కానిస్టేబుల్. పోలీసులకు చిక్కకుండా బైక్ దొంగతనాలకు పాల్పుడుతున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నాడు. దీంతో పోలీసు ఉన్నాధికారులు ఆ పోలీసు కానిస్టేబుల్‌ను అభినందించారు. క్యాష్ రివార్డు ఇచ్చి సత్కరించారు. బైక్ దొంగల ముఠా అమ్మేసిన దాదాపు 26 రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



ఒక్కో ఎన్ ఫీల్డ్ ఖరీదు రూ.30వేలకు అమ్మేశారు బైక్ దొంగలు. గత ఆగస్టు 6న తన స్నేహితుడి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ దొంగలు కొట్టేశారు. స్నేహితుడు ఫిర్యాదుతో హెడ్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ రంగంలోకి దిగాడు. సింగిల్‌గా ఇన్విస్టిగేషన్ చేసి బైక్ దొంగలను పట్టుకున్నాడు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో మూడేళ్లుగా దొంగతనాలకు పాల్పుడుతున్న బైక్ దొంగల రాకెట్ ఆట కట్టించాడు.



బైక్ దొంగలపై నిఘా పెట్టిన హెడ్ కానిస్టేబుల్ శ్రావణ్.. ముఠాలో 10 మంది దొంగలను అరెస్ట్ చేశాడు. స్నేహితుడి బైక్ పోయిందని ఫిర్యాదు చేసిన తర్వాత మరో రెండు ఫిర్యాదులు అందాయి. ఇదే తరహాలో దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు మొదలుపెట్టాడు.
https://10tv.in/armed-police-training-centre-official-arrested-for-raping-woman-constable-trainee-assam/
Police constable single-handedly busts bike thieves

రాయల్ ఎన్ ఫీల్డ్ బ్రాండ్ బైకులే లక్ష్యంగా  బైక్ దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడుతోంది. ఒకే రకమైన బైక్ దొంగతనాలకు సంబంధించి 24 పోలీసు స్టేషన్లకు ఫిర్యాదులు అందాయి. అంటే దొంగలు.. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులనే దొంగిలించి అమ్ముతున్నారని కానిస్టేబుల్ శ్రావణ్ భావించాడు.



బైకులు దొంగతనం చేసిన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు లేవు. దీంతో బైకు దొంగలను గుర్తించడం కష్టంగా మారింది. సీసీ కెమెరాల కంట పడకుండా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని శ్రావణ్ కుమార్ గుర్తించారు. రెండు నెలలుగా దర్యాప్తు చేశాడు.. 56 రోజుల పాటు వారిపై నిఘా పెట్టాడు. ఎట్టకేలకు దొంగల ముఠాను పట్టుకున్నాడు. ఆగస్టు 6న జరిగిన దొంగతనం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అది కూడా తన స్నేహితుడు బైక్.. రెండు రోజుల తర్వాత దొంగలు ఆ బైకును అక్కడి నుంచి మరో చోటుకు తరలించారు.



దొంగల ప్రతి కదిలికపై నిఘా పెట్టసాగారు. హౌసింగ్ బోర్డు నుంచి మరో దొంగల ముఠా కొట్టేసిన బైకులను శాంట్ హోంకు తరలించారు. 15 రోజుల పాటు శ్రావణ్ దొంగల కదిలికలపై నిఘా పెట్టారు. అదే మార్గంలో మరో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ తీసుకొచ్చారు. దాంతో కానిస్టేబుల్ అనుమానమే నిజమైంది.



పోలీసుల కళ్లు కప్పేందుకు బైక్ దొంగల ముఠా ఇలా బైకులను ఒక చోట నుంచి మరో చోటుకు తరలిస్తున్నారని గుర్తించాడు. Thiruvanmiyur, Uthandi toll వద్ద దొంగల ముఠాను గుర్తించారు. పోలీసులను ఏమార్చేందుకు దొంగలు బైకులను ఒకరినొకరు మార్చేసుకున్నారు. దాంతో పోలీసులు వారి ఫోన్లను ట్రాకింగ్ చేసి 10మంది దొంగలను అరెస్ట్ చేశారు. దొంగలను పట్టుకునేందుకు ఎలాంటి టెక్నిక్ వాడారో పోలీసులు రివీల్ చేయలేదు.