Rajahmundry : వీడిన మిస్టరీ…తల్లి మరణంతో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు పిల్లలు

రాజమహేంద్రవరం గౌతమీ జీవ కారుణ్య సంఘం ఎదురుగా ఉన్న గోదావరి ఇసుక ర్యాంపు లో వారం రోజులు క్రితం లభ్యమైన మూడు మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది.

Rajahmundry : వీడిన మిస్టరీ…తల్లి మరణంతో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు పిల్లలు

Police Cracked Three Dead Bodies Mystery

Rajahmundry : రాజమహేంద్రవరం గౌతమీ జీవ కారుణ్య సంఘం ఎదురుగా ఉన్న గోదావరి ఇసుక ర్యాంపు లో వారం రోజులు క్రితం లభ్యమైన మూడు మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది. ముగ్గురు మృతులు సొంత అక్కాచెల్లెలు, తమ్ముడిగా పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు.

కొవ్వూరు బాపూజీ నగర్ కు చెందిన మామిడిపల్లి కన్నా దేవి (34) ఆమె చెల్లెలు నాగమణి (32) వీరి తమ్ముడు దుర్గారావు (30) గా పోలీసు విచారణలో తేలింది. ఈ ముగ్గురు గత నెల 30వ తేదీన గోదావరిలో శవాలుగా కనిపించారు. వీరి తండ్రి మామిడిపల్లి నరసింహారావు.

నరసింహారావు రైల్వేలో గ్యాంగ్ మేన్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. ముగ్గురికి వివాహాలు కాలేదు. వీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత, పిల్లలకు వివాహాలు చేయాలని నరసింహారావు దంపతులు నిర్ణయించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు నరసింహారావు భార్యకు ఊపిరితిత్తుల వ్యాధి ఉంది.అనారోగ్యానికి గురైన ఆమె గత నెల 31న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

తల్లి అంత్యక్రియలకు బంధువులు ఎవరూ రాకపోవటంతో పిల్లలు మనస్తాపం చెందారు. తల్లి అంత్యక్రియల అనంతరం తండ్రిని ఆటోలో ఇంటికి పంపి.. గోదావరిలో అక్కాచెల్లెళ్లు, తమ్ముడు దూకేశారు. ఈనెల ఒకటిన రాజమండ్రి ఇసుక ర్యాంప్ వద్ద గోదావరిలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు రోజులు మార్చురీలో ఉన్న మృతదేహాల వద్దకు ఎవరూ రాకపోవడంతో 5వ తేదీన రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు ఖననం చేసేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నపోలీసులు మృతదేహాలను మామిడిపల్లి నరసింహారావు కుటుంబానికి చెందిన వారివిగా గుర్తించారు.

అయితే దారుణం ఏంటంటే నరసింహారావుకు ముగ్గురు పిల్లలను చూసే ఆఖరి చూపు కూడా దక్కలేదు. వీరి మరణానికి గల కారణం తల్లి మృతి చెందటం బంధువులు ఎవరు దగ్గరికి రాకపోవటంతో మనస్థాపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. రాజమండ్రి వన్ టౌన్ ఎస్ఐ నవీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.