పోలీసులు నాపై అత్యాచారయత్నం చెయ్యలేదు : ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రవిజ

బంజారాహిల్స్ పోలీసులపై ప్రవిజ దంపతులు చేసిన అత్యాచార ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 01:31 PM IST
పోలీసులు నాపై అత్యాచారయత్నం చెయ్యలేదు : ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రవిజ

బంజారాహిల్స్ పోలీసులపై ప్రవిజ దంపతులు చేసిన అత్యాచార ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని

బంజారాహిల్స్ పోలీసులపై ప్రవిజ దంపతులు చేసిన అత్యాచార యత్నం ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని గురించి పెద్ద చర్చ జరిగింది. ఇంతలోనే.. ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రవిజ దంపతులు మాట మార్చారు. 

బంజారాహిల్స్ పోలీసులపై తాము అసత్య ఆరోపణలు చేశామని అట్లూరి సురేష్, ప్రవిజ దంపతులు సోషల్ మీడియాలో మరో వీడియో పోస్ట్ చేశారు. పోలీసులపై ఆరోపణలు చేస్తూ పెట్టిన వీడియోలన్నీ డిలీట్ చేసినట్టు చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు తమను క్షమించాలని కోరారు. తాము మతిస్థిమితం కోల్పోయిన సమయంలో ఇదంతా జరిగిందని వివరించారు. పోలీసులు తనపై అత్యాచార యత్నం చెయ్యలేదని ప్రవిజ స్పష్టం చేశారు. మీడియా, సొసైటీని తమ వీడియోలతో ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు. తొందరపాటుతో తాము పోలీసులపై ఆరోపణలు చేశామన్నారు. మేము చేసిన పనికి కుటుంబ సభ్యులు, బంధువులు చీవాట్లు పెట్టారని.. వారి మందలింపుతో తమ తప్పు తెలుసుకున్నామని వివరించారు. అందరూ తమను క్షమించాలని వీడియోలో ప్రవిజ దంపతులు రిక్వెస్ట్ చేశారు.

విజయవాడకి చెందిన అట్లూరి సురేష్, ప్రవిజలు.. ఓ కేసు విషయంలో ఫిర్యాదు ఇవ్వడానికి డిసెంబర్ 8న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే పోలీసులు తమ కేసును పట్టించుకోకపోగా తనపై అత్యాచారానికి యత్నించారని ప్రవిజ ఆరోపించారు. తన భార్య పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని సురేష్ కూడా ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేయడంతో.. అది వైరల్‌ అయ్యింది. దీనిపై కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని మరో వీడియోలో ప్రవిజ దంపతులు తెలిపారు.

దీనిపై స్పందించిన బంజారాహిల్స్ పోలీసులు.. ప్రవిజ దంపతులు చేసిన ఆరోపణలను ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు. వారు అబద్దాలు చెప్పారని అన్నారు. వారిద్దరిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలోనూ ప్రవిజ దంపతులు ఇలానే ప్రవర్తించారని, వారిపై కేసు కూడా నమోదైందని పోలీసులు తెలిపారు.

కాగా, పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రవిజ దంపతులు.. కొన్ని గంటల్లోనే మాట మార్చడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ప్రవిజ దంపతులు ఎందుకు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు? ఆ తర్వాత ఎందుకు మాట మార్చారు? అనేది మిస్టరీగా మారింది.