Hyderabad: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సీసీటీవీ పుటేజీలు పరిశీలించిన పోలీసులు.. కీలక వివరాలు సేకరణ

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలో బాలికను రెండు వేర్వేరు హోటళ్లకు తీసుకెళ్లారని, అక్కడ ఆమెపై నిందితులు సామూహిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు.

Hyderabad: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సీసీటీవీ పుటేజీలు పరిశీలించిన పోలీసులు.. కీలక వివరాలు సేకరణ

Two arrested in Dabeerpura case

Hyderabad: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలో బాలికను రెండు వేర్వేరు హోటళ్లకు తీసుకెళ్లారని, అక్కడ ఆమెపై నిందితులు సామూహిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు అందుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులు నయీమత్ (26), సయ్యద్ రబీష్ (20)పై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Dongalunnaru Jagratha Trailer: అడ్డంగా దొరికిపోయిన MM కీరవాణి కొడుకు శ్రీ సింహా.. “దొంగలున్నారు జాగ్రత్త” ట్రైలర్!

సోమవారం సాయంత్రం మందులకోసం మెడికల్ స్టోర్‌కు వెళ్లిన పదమూడేళ్ల కుమార్తె ఇంటికి తిరిగి రాలేదని బాలిక తల్లి మంగళవారం హైదరాబాద్‌లోని దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలికను కారులో తీసుకెళ్లినట్లు కొందరు ఫిర్యాదు చేయడంతో అపహరణ కేసుగా పోలీసులు నమోదు చేశారు. అయితే బుధవారం బాలికను నగరంలోని ఓ ప్రదేశంలో వదిలివేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. కేసును విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. బాలికకు కౌన్సెలింగ్, మెడికల్, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.

Rajasthan: బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి.. కాపాడేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడే ముందు తన కుమార్తెకు ఏదో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారని, మద్యం కూడా తాగించారని బాధితురాలి తల్లి వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ పుటేజ్ లను పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు బాలికను రెండు హోటళ్లకు తీసుకెళ్లారని, రెండు రోజులు వారితోనే ఉంచుకున్నట్లు గుర్తించారు. ఇదిలాఉంటే నిందితుల్లో రబీష్ హైస్కూల్ డ్రాప్-అవుట్ కాగా, నయీమత్ సౌదీ అరేబియాలో ఆప్టికల్ స్టోర్ నడుపుతూ ఉండేవాడు. అక్కడి నుంచి ఈ మార్చిలో తిరిగి వచ్చాడు. అయితే.. ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారు స్వాధీనం చేసుకున్నామని, వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని ఏసీపీ ప్రసాదరావు తెలిపారు.