లాక్ డౌన్ వేళ ఆర్ఎంపీ ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్ఎంపీ బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో పోలీసులు అతడి ఇంట్లో సోదాల కోసం వెళితే మరో ఘోరం వెలుగు చూసింది. మూడో కంటికి

  • Published By: veegamteam ,Published On : April 12, 2020 / 07:23 AM IST
లాక్ డౌన్ వేళ ఆర్ఎంపీ ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్ఎంపీ బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో పోలీసులు అతడి ఇంట్లో సోదాల కోసం వెళితే మరో ఘోరం వెలుగు చూసింది. మూడో కంటికి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్ఎంపీ బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో పోలీసులు అతడి ఇంట్లో సోదాల కోసం వెళితే మరో ఘోరం వెలుగు చూసింది. మూడో కంటికి తెలియకుండా అతడు చేస్తున్న అక్రమ దందా వెలుగు చూసింది. అక్రమ మద్యం అమ్మకం బయటపడింది. దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురంలో ఓ మృత శిశువును ముళ్లపొదల్లో పడేసిన సంఘటనపై పోలీసులు శుక్రవారం విచారణ కోసం ఆర్‌ఎంపీ ఖాజాపాషా ఇంటికి వెళ్లారు. అప్పుడే అతడి బాగోతం బయటపడింది. 

ఆర్‌ఎంపీ, చుట్టుపక్కల మరికొంతమంది ఇళ్లల్లో సోదాలు చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.లక్షల విలువైన వివిధ రకాల ఔషధాలు, ఇంజెక్షన్లు, అబార్షన్‌లకు సంబంధించిన ఇతర పరికరాలు పోలీసుల కంటపడ్డాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్రమంగా మద్యాన్ని కూడా విక్రయిస్తున్నాడని తెలుసుకున్నారు. సుమారు రూ.50 వేల విలువైన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ ఎస్కే ఖాజాపాషా దగ్గరికి గురువారం రాత్రి 5 నెలల గర్భిణి, ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అబార్షన్) చేయాలని కోరారు. ఎక్కువ మొత్తంలో డబ్బు ఆశ చూపడంతో ఖాజాపాషా అబార్షన్‌ కావడానికి మాత్రలు ఇచ్చారు. కొంత సమయం తర్వాత గర్భిణి మృత ఆడ శిశువుకు జన్మనివ్వగా, ఆ శిశువును ముళ్లపొదల్లో పడేసి ముగ్గురూ గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం స్థానికులు మృత శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎంక్వైరీ చేయగా ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. పరారీలో ఉన్న ఆర్‌ఎంపీ, బాలింత, మరో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ షాపులు మూసేసిన సంగతి తెలిసిందే. ఎక్కడా మద్యం దొరకడం లేదు. దీంతో మద్యం ప్రియులు పిచ్చెక్కిపోతున్నారు. మద్యం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా కొందరు మద్యం దుకాణాల వ్యాపారులు అక్రమ దందాకు తెరతీశారు. మూడో కంటికి తెలియకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. ఆర్ఎంపీ ఇంట్లో మద్యం బాటిళ్లు దొరకడం కలకలం రేపింది. అసలు అతడికి మద్యం బాటిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సరఫరా చేస్తున్నారు? వాటిని ఎవరికి అమ్ముతున్నారు? తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు.