Adibatla Kidnap Case : వైశాలిని కిడ్నాప్ చేయడానికి కారణమిదే.. నవీన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు

విచారణలో నవీన్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎన్ఆర్ఐతో వైశాలికి పెళ్లి కుదిరిందని తెలుసుకున్న నవీన్.. ఆ పెళ్లిని చెడగొట్టేందుకే అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో నవీప్ ఒప్పుకున్నాడు.

Adibatla Kidnap Case  : వైశాలిని కిడ్నాప్ చేయడానికి కారణమిదే.. నవీన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు

Adibatla Kidnap Case : రాష్ట్రంలో సంచలనం రేపిన ఆదిభట్ల మన్నెగూడ బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ రెడ్డి క్రూరత్వం గురించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. విచారణలో నవీన్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అసలేం జరిగిందో రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వైశాలితో పెళ్లికి ఆమె తల్లిదండ్రులు నిరాకరించడంతో వైశాలిపై కక్ష పెంచుకున్నాడు నవీన్. ఎలాగైనా సరే వైశాలిని పెళ్లి చేసుకునేందుకు నవీన్ కుట్రలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.

Also Read..Vaishali Kidnap Case : కిడ్నాప్ వెనుక ఎంతో పెయిన్ ఉంది, నన్ను నెగిటివ్‌గా చూడొద్దు.. వైశాలి కిడ్నాప్‌పై నవీన్ సెల్ఫీ వీడియో

తనకు వైశాలికి పెళ్లి అయిపోయిందంటూ తప్పుడు పత్రాలు సృష్టించిన నవీన్.. వాటి ద్వారా అమ్మాయి తల్లిదండ్రులకు నోటీసులు పంపాడు. ఇంతలో ఎన్ఆర్ఐతో వైశాలికి పెళ్లి కుదిరిందని తెలుసుకున్న నవీన్.. ఆ పెళ్లిని చెడగొట్టేందుకే అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో నవీప్ ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి తన భార్య అని అబద్దం చెప్పి.. తన పని వారిని రెచ్చగొట్టాడు నవీన్. వారికి తప్ప తాగించి వైశాలి ఇంట్లో బీభత్సం సృష్టించాలని తన మనుషులకు చెప్పానని నవీన్ వెల్లడించాడు. చంపాలనే ఉద్దేశంతోనే యువతి తండ్రిపై దాడి చేసినట్లు అంగీకరించాడు.

Also Read..Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి నేరచరిత్రపై ఆరా, గతంలో రెండు కేసులు నమోదు

ఈ నెల 9న నవీన్ రెడ్డి తన 40 మంది అనుచరులతో సినీ ఫక్కీలో వైశాలి ఇంటికి వెళ్లి దాడి చేశాడు. అడ్డుకోబోయిన వైశాలి తల్లిదండ్రులను, బంధువులను, చుట్టుపక్కల వారిపైనా దాడి చేశాడు. ఆ తర్వాత బలవంతంగా వైశాలిని తీసుకెళ్లాడు. అక్కడి నుంచి నల్గొండ వైపు తీసుకెళ్లాడు. కాగా, పోలీసులు తన కోసం గాలిస్తున్నారు అనే విషయం తెలియగానే నవీన్ రెడ్డి అలర్ట్ అయ్యాడు. దీంతో వైశాలిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. నల్గొండ నుంచి కర్నూలు, బళ్లారి మీదుగా గోవాకు పారిపోయాడు నవీన్. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నవీన్ రెడ్డి గోవాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు పొందుపరిచారు. తనను పెళ్లి చేసుకోకపోవడంతో కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైశాలిని నవీన్ రెడ్డి వేధింపులకు గురి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వైశాలి ఇంటి ముందే టెట్ వేసిన నవీన్.. ఎప్పటికప్పుడు ఆమె కదలికలు పసిగట్టేవాడన్నారు. నవీన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. సీన్ ఆఫ్ క్రైమ్.. రీ కన్ స్ట్రక్షన్ కూడా చేయాల్సి ఉన్నందున నవీన్ ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఆదిభట్ల పోలీసులు.. ఇబ్రహీంపట్నం కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది.