Shamshabad : మహిళను చంపి మ్యాన్ హోల్‌లో పడేసిన వ్యక్తి… ఏమీ ఎరగనట్టు పోలీస్ స్టేషన్ కు వెళ్లి..

మహిళను చంపి మ్యాన్ హోల్ లో పడేసిన ఘటన వెలుగులోెకి వచ్చింది. ఈకేసును పోలీసులు ఛేధించారు. దీనికి కారణం వివాహేతర సబంధమేనని తేల్చారు. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయి కృష్ణ అనే వ్యక్తి  పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను హత్య చేసి డెడ్ బాడీని ఓ మ్యాన్ హోల్ లో పడేశాడు.

Shamshabad : మహిళను చంపి మ్యాన్ హోల్‌లో పడేసిన వ్యక్తి… ఏమీ ఎరగనట్టు పోలీస్ స్టేషన్ కు వెళ్లి..

Shamshabad

Shamshabad Case : రంగారెడ్డి జిల్లా (Ranga reddy District) శంషాబాద్‌ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను చంపి మ్యాన్ హోల్ (Manhole) లో పడేసిన ఘటన వెలుగులోెకి వచ్చింది. ఈ కేసును పోలీసులు ఛేదిచారు. దీనికి కారణం వివాహేతర సంబంధమేనని తెలుస్తోంది. అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయి కృష్ణ అనే వ్యక్తి..  పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. తరువాత డెడ్ బాడీని ఓ మ్యాన్ హోల్ లో పడేశాడు.

శంషాబాద్ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ ఓ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసి ఉద్యోగం మానివేసి పూజారిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సాయికృష్ణ సరూర్‌నగర్‌ కు చెందిన అప్సర అనే మహిళతో పరిచయం అయ్యింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్సరకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో పూజారిగా పనిచేస్తున్న సాయికృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్యా సంబంధం కొనసాగుతున్న క్రమంలో ఇటీవల అప్సర తనను పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో తన గుట్టు రట్టు అవుతుందని భావించిన సాయి జూన్ 3న మాట్లాడుకుందామని అప్సరను రమ్మన్నాడు. ఆమెను కారులో సుల్తాన్‌పల్లికి తీసుకెళ్లాడు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సాయికృష్ణ.. ఆమె తలపై బండరాయితో మోది హత్య చేశాడు.

తరువాత తన కారులోనే ఆమె మృతదేహాన్ని సరూర్‌నగర్‌కు తీసుకువచ్చాడు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి కామ్ గా శంషాబాద్‌ వచ్చేశాడు.  ఏమీ తెలియనట్లుగా తన బంధువు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయికృష్ణపై అనుమానపడ్డారు. దీంట్లో భాగంగా అతనిపై నిఘా వేశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌తోపాటు.. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు. దీంతో సాయికృష్ణను అరెస్ట్ చేసి విచారించగా అప్సరను తానే చంపానని అంగీకరించాడు. మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌ నుంచి వెలికి తీసి, పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు పోలీసులు.

Also Read: పొలం దున్నుతుండగా వ్యవసాయ బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ దుర్మరణం

కాగా తన కుమారుడు ఓ మహిళను హత్య చేశాడని విషయంపై సాయి కృష్ణ తండ్రి స్పందించాడు. తన కుమారుడు అటువంటి వ్యక్తి కాదని ఇది తాను ఓ తండ్రిగా చెప్పటంలేదని.. ఎవరినైనా అడిగి తెలుసుకోండి అంటూ 10టీవీకి తెలిపారు. మరి పోలీసుల విచారణలో తానే అప్సరను చంపినట్లుగా ఎందుకు అంగీకరించాడు? అని ప్రశ్నించగా.. అది ఎలా జరిగిందో నాకు తెలియదు.. పోలీసులు చెప్పేది తప్పు అని నేను చెప్పను.. కానీ ఇంత దారుణం ఎలా జరిగిందో మాత్రం అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క అప్సర తల్లి తన కూతురు చాలా మంచిదని చెడు పనులు చేసే అమ్మాయి కాదని, తన కూతురిని ఇంత దారుణంగా హత్య చేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కీలకంగా పోస్ట్ మార్టం రిపోర్ట్
అప్సర హత్య కేసు లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కానుంది. గర్భవతిగా ఉన్న అప్సరను సాయి కృష్ణ హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అప్సర గర్భంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైనట్టు తెలుస్తోంది.
మొదటి సారి గర్భవతి అయినప్పుడు అబార్షన్ చేయించాడని, రెండో సారి గర్భం దాల్చడంతోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు పోలీసులు చెబుతున్నారు.