సీఎం జగన్ సీరియస్ : చిన్నారిపై అత్యాచారం..హత్య కేసు

  • Published By: madhu ,Published On : November 10, 2019 / 05:51 AM IST
సీఎం జగన్ సీరియస్ : చిన్నారిపై అత్యాచారం..హత్య కేసు

చిత్తూరు జిల్లా గుట్టపాళ్యంలో చిన్నారి హత్య ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని, దారుణమైన ఘటనకు పాల్పడిన వ్యక్తికి..కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి అత్యాచారం, హత్య తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు.

మూడు బృందాలు కర్నాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పాపతో మాట్లాడడం..మొబైల్‌లో ఫొటోలు తీయడం..కళ్యాణ మంటపం వెనుక వైపుకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాచ్ మెన్ సాక్ష్యాన్ని నమోదు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సీరియస్ అవడంతో నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 

బి.కొత్తకోట మండలం గుట్టపాళంకు చెందిన ఉషారాణి, సిద్ధారెడ్డి దంపతులు 2019, నవంబర్ 07వ తేదీ గురువారం కురబలకోట మండలం చేనేత నగర్‌లో కళ్యాణ మండపంలో జరిగిన వివాహానికి కుటుంబసమేతంగా వచ్చారు. వారి వెంట కుమార్తెలు వైష్ణవి, వర్షిణి, వర్షితలు కూడా వచ్చారు. పెళ్లిక వచ్చిన ఇతర పిల్లలతో వర్షిత ఆడుకుంది. రాత్రి 9.30గంటల తర్వాత వర్షిత కనిపించకుండా పోయింది.

తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చుట్టుపక్కలా వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. చివరకు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. రాత్రి కళ్యాణ మండపంలోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వర్షితను తన వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేసినట్లు కెమెరాల్లో రికార్డయ్యాయి. నవంబర్ 08వ తేదీ ఉదయం 6.30 గంటల సమీపంలో కళ్యాణ మండపానికి వెనుకవైపు ప్రహారీ కింద వర్షిత విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వర్షిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి హామీనిచ్చారు. 
Read More : ఎన్టీఆర్ సినిమా కథ కాదు: రెండు రూపాయల గొడవ.. పొడిచి చంపేశాడు