Publish Date - 8:34 pm, Wed, 3 March 21
Polices forcing to dance destitute girls in govt hostel : మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కాపాడాల్సిన పోలీసులే పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు వ్యక్తులతో కలిసి బాలికల బట్టలు విప్పించి హాస్టల్‌లో డ్యాన్సులు చేయించారు పోలీసులు. ఆశాదీప్ ఉమెన్స్ హాస్టల్ లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్రంలోని చిక్లి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే దిగువ సభలో ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానిక ఎన్‌జీవో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
జల్‌గావ్‌లో ఆశాదీప్ మహిళల వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులు, కొందరితో కలిసి హాస్టల్‌కి వెళ్లారు. అక్కడి విద్యార్థినిలను బెదిరించి బట్టలు విప్పించారు.. వారితో నగ్నంగా డ్యాన్స్ చేయించారు. దీనిపై ఎమ్మెల్యే శ్వేతా మహాలే అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షిణ కల్పించాల్సిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడటం ఎంతో సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి బాధితులు చాలా మందే ఉంటారు.
ఈ ఘటన విషయంలో పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని శ్వేతా మహాలే చెప్పారు. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామన్నారు. మహాలే లేవనెత్తిన సమస్యకు సమాధానమిస్తూ దేశ్ ముఖ్ దర్యాప్తు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ హాస్టల్‌ను నిర్వహిస్తుంది. గణేష్ కాలనీలోని హాస్టల్‌లో నిరాశ్రయులకు, అణగారిన మహిళలకు, బాలికలకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆశ్రయంతో పాటు ఆహారాన్ని అందిస్తుంది.