అట్టుడికిపోతున్న తమిళనాడు : పొల్లాచ్చి సెక్స్ రాకెట్ లో అధికార పార్టీ నేతలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 12, 2019 / 11:02 AM IST
అట్టుడికిపోతున్న తమిళనాడు : పొల్లాచ్చి సెక్స్ రాకెట్ లో అధికార పార్టీ నేతలు

తమిళనాడులో భారీ సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు చేధించారు. పొల్లాచ్చిలోని నలుగురు సభ్యుల ముఠా 50మందికిపైగా మహిళలు,యుతులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఇప్పుడు తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది.ఏడేళ్లుగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, వీడియోలు తీసి వారిని వేధింపులకు గురిచేయడం వంటి అరాచకాలకు పాల్పడుతున్న ఈ ముఠా  అరాచకాలు ఓ 19 ఏళ్ల విద్యార్థిని కంప్లెయింట్ తో వెలుగులోకి వచ్చాయి. విచారణలో నిందితులు చెప్పిన వివరాలు విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఫేస్ బుక్ లో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం, ప్రేమిస్తున్నానంటూ వారిపై అత్యాచారాలకు పాల్పడటం, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కి పాల్పడం, ఎవరికైనా విషయం చెబితే ఇంటర్నెట్ లో వీడియో అప్ లోడ్ చేస్తామని బాధిత యువతులను ఈ నలుగురు సభ్యుల ముఠా బెదిరించేది. అయితే ఈ సెక్స్ రాకెట్ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు కూడా ఉండటం ఇప్పుడు తమిళ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పొల్లాచ్చిలోని జ్యోతినగర్ లో ఉండే ప్రియా(19) అనే యువతితో శబరీ రాజన్(25) అనే వ్యక్తి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ షిప్ చేశాడు. ఫోన్ నంబర్ తీసుకొని కొన్ని రోజులపాటు తన మాయమాటలతో ప్రియను నమ్మించి ఒకరోజు తనతో బయటకి రావాలని కోరాడు. నమ్మి వెళ్లిన ఆ యువతిని రాజన్ తన స్నేహితులతో కలిసి రేప్ చేశాడు. అంతేకాకుండా వీడియో కూడా తీశారు.అనంతరం కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేసి పారిపోయారు. అక్కడితో ఆగకుండా..డబ్బులు ఇవ్వాలని లేదంటే వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేస్తామంటూ  ఫోన్‌ ద్వారా  వేధింపులకు దిగారు. ఈ టార్చర్‌ తో విసిగిపోయిన ప్రియ తల్లిదండ్రుల సాయంతో ఫిబ్రవరి 24న పోలీసులకు కంప్లెయింట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి-25న ముగ్గురు  నిందితులను అరెస్ట్‌ చేసి కూపీ లాగగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.వారి దగ్గర నుంచి సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో అనేకమంది అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు గుర్తించారు. మార్చి-5,2019న ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు తిరునవక్కరసుని పోలీసులు అరెస్ట్ చేశారు.

కదిలే వాహనాల్లో,హోటల్స్ లో, అన్నామలై ఫారెస్ట్ కి దగ్గర్లోని ఓ ఫామ్ హౌజ్ లో ఈ నలుగురు సభ్యుల ముఠా యువతులపై అత్యాచారాలకు పాల్పడేవారని, చెన్నై, కోయంబత్తూరు, సేలం ఇలా తమిళనాడులోని అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థినిలు,స్కూల్ అండ్ కాలేజీ టీచర్లు,డాక్టర్లు,యువతులు ఈ సెక్స్ రాకెట్ బాధితులుగా ఉన్నారని తెలిపారు. పరువు పోతుందన్న భయంతో అనేకమంది యవతులు కంప్లెయింట్ ఇచ్చేందుకు వెనుకాడుతున్నారని తెలిపారు.

ఈ సెక్స్ రాకెట్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే నేత నాగరాజ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ సెక్స్ రాకెట్ లో పలువురు సినీతారల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడం ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ..తనకు గానీ, తన కొడుకుకి గానీ ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రత్యర్థులు కావాలనే తమపై  కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  అధికారపార్తటీకి చెందరు కొందరు ఈ సెక్స్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయ్యారని, తమిళనాడు డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్ సన్నిహితుడు ఒకరు కూడా ఈ సెక్స్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వెంటనే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష డీఎంకే,ఎమ్ డీఎంకే పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు పొల్లాచ్చిలో ఆందోళనకు డీఎంకే సిద్ధమైంది. సీబీసీఐడీ విచారణ కోరుతూ గతవారం పొల్లాచ్చిలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(AIDWA)తమిళనాడు విభాగం ఆందోళన నిర్వహించింది. ఈ కేసులో మరో 20మంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లు మంగళవారం(మార్చి-12,2019) కోయంబత్తూరు రూరల్ ఎస్పీ ఆర్.పాండియరాజన్ తెలిపారు.