Porn Videos Case : అరెస్ట్‌ను ఆపేందుకు పోలీసులకు ఆఫర్ ఇచ్చిన హీరోయిన్
పోర్న్ వీడియోలను తీసి ఓటీటీ కంటెంట్‌లో అప్లోడ్ చేశారనే నేరంతో అరెస్టైన రాజ్కుంద్ర్రా కేసు పలు మలుపులు తిరుగుతోంది.
Porn Videos Case : పోర్న్ వీడియోలను తీసి ఓటీటీ కంటెంట్‌లో అప్లోడ్ చేశారనే నేరంతో అరెస్టైన రాజ్కుంద్ర్రా కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్న్ చిత్రంలో నటిస్తుండగా గెహనా వశిష్ట్ అనే హీరోయిన్ను పోలీసులు ముంబైలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో తీగలాగితే డొంకంతా కదిలింది. కాగా ఆ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు గెహనా బంపరాఫర్ ఇచ్చినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన వాట్సప్ చాట్ ఇటీవల వైరల్ అయ్యింది.
తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు పోలీసులకు గెహనా వశిష్ట్ రూ.15 లక్షలు లంచంగా ఇచ్చేందుకు సిధ్దమైందని తెలిసింది. ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో నన్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మీకెంత కావాలో చెప్పండి అని ఆమె పోలీసులకు ఆఫర్ ఇచ్చారని ఆరోపణలు వెలుగు చూశాయి. ఇక చివరిగా రూ.15 లక్షలు ఇస్తాను…నన్ను వదిలేయండి…. అని పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుందని దర్యాప్తులో తేలింది.
అయితే లంచం పోలీసులే డిమాండ్ చేశారని గెహనా ఆరోపించింది. ఈ కేసు విషయంలో ఇద్దరితో వాట్సప్ చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వారు యశ్ ఠాకూర్ అలియాస్ అర్వింద్ కుమార్ శ్రీవాస్తవ, రెండవ వారు తన్వీర్ హష్మీ. వీరితో ఈ కేసు విషయమై గెహానా వశిష్ట్ చాటింగ్ చేసింది. పోలీసులు లంచం అడగడంతో వారిద్దరూ కలిసి రూ. 8 లక్షలు వరకు సమకూర్చగలరని ఆ చాటింగ్‌లో ఉంది. గెహనా నటించిన మూడు అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలతో రాజ్ కుంద్రాకు చెందిన కంపెనీలో ఉన్నవ్యాపారవేత్త కాస్తా నిర్మాతగా మారిన వ్యక్తికి సంబంధం ఉన్నట్లు బయటపడింది.