Gujarat : పోర్న్‌కు బానిసయ్యాడు…ప్రియురాలి కోరికల కోసం

సంస్థలో పని చేస్తూ...దానికే కన్నం వేశాడు. అశ్లీల కంటెంట్ చూడటానికి డబ్బులు వాడుకున్నాడు. ఆన్ లైన్ లో పరిచయమైన ఓ మహిళ మానసిక బలహీనతను తెలుసుకుని...పలుమార్లు డబ్బులు రాబట్టింది.

Gujarat : పోర్న్‌కు బానిసయ్యాడు…ప్రియురాలి కోరికల కోసం

Gujarath

Gujarat Adult Content : అకౌంటెంట్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి పోర్న్ కు బానిసగా మారిపోయాడు. అదే పనిగా అశ్లీల కంటెంట్ చూడసాగాడు.  సంస్థలో పని చేస్తూ…దానికే కన్నం వేశాడు. అశ్లీల కంటెంట్ చూడటానికి భారీగా డబ్బులు వాడుకున్నాడు. అంతేగాకుండా..ఇటీవలే ఆన్ లైన్ లో పరిచయమైన ఓ మహిళ అతడి మానసిక బలహీనతను తెలుసుకుని…పలుమార్లు డబ్బులు రాబట్టడం చేసింది. చివరకు అతను చేస్తున్న మోసం బయటపడింది. పోలీసులు అతడితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.

Read More : Crazy Woman :ఆహారం, కూరగాయలంటే ఆమెకు భయం..చూస్తే చాలు వణికిపోతుంది..ఏం తిని బతుకుతోందంటే..

ఇర్ఫాన్ షేక్ అనే వ్యక్తి గ్రాఫిక్ డిజైనర్. ఇతనికి చెందిన సంస్థలో తుషార్ సెజ్ పాల్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. తుషార్ కు పోర్న్ సైట్స్ చూడడం అలవాటు. ఈ అలవాటు మితిమీరిపోయింది. ఎప్పుడూ అశ్లీల కంటెంట్ చూడసాగాడు. ఇంటర్నెట్ లో అడల్ట్ మూవీస్ చూడటానికి డబ్బులు అవసరం వచ్చింది. సంస్థ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వాడుకొనే వాడు. ఇలా మొత్తం రూ. 16 లక్షలు వరకు వాడుకున్నాడు. ఇటీవలే ఆన్ లైన్ లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా స్నేహంగా మారడం.. కొన్ని రోజులకు వారి మధ్య ప్రేమ చిగురించడం జరిగింది.

Read More : Bengaluru : ఫుల్ గా మందేశాడు..సాంబార్ టేస్ట్‌‌గా లేదని, తల్లిని, చెల్లిని చంపేశాడు

తుషార్ సెజ్ పాల్ బలహీనతను ఆ మహిళ తెలుసుకుంది. ఇతడి నుంచి డబ్బులు రాబట్టాలని ప్లాన్ వేసింది. ఆమె కోరిక మేరకు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ట్రాన్స్ ఫర్ చేసేవాడు. సంస్థ యజమాని ఇర్ఫాన్ కు తెలియనీయకుండా గుట్టుగా ఉంచేవాడు. ఇర్ఫాన్ సంస్థ బ్యాంకు ఖాతా నుంచి రూ. 85 లక్షల వరకు మొత్తాన్ని బదిలీ చేశాడు. ఇర్ఫాన్ కొనుగోలు చేసిన ఇంటికి ఈఎంఐలు చెల్లించకుండా…ఆ మొత్తాన్ని ప్రియురాలి ఖాతాకు మళ్లించాడు సెజ్ పాల్. చివరకు ఇర్ఫాన్ కు తెలిసిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం మొత్తం బట్టబయలైంది. ఇర్ఫాన్ ఖాతా నుంచి మొత్తం రూ. కోటి వరకు సెజ్ పాల్ సొంతానికి ఉపయోగించుకున్నాడని తేలింది. దీని ఆధారంగా..సెజ్ పాల్, అతని ప్రియురాలు, ఆమె తల్లితో సహా ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.