నగ్నచిత్రాలు పంపకపోతే బూతు సైట్లలో ఫోన్ నెంబర్ పెడతా, వాట్సాప్‌లో మహిళలను వేధిస్తున్న సైకో అరెస్ట్

  • Published By: naveen ,Published On : August 2, 2020 / 10:01 AM IST
నగ్నచిత్రాలు పంపకపోతే బూతు సైట్లలో ఫోన్ నెంబర్ పెడతా, వాట్సాప్‌లో మహిళలను వేధిస్తున్న సైకో అరెస్ట్

వాట్సాప్ లో మహిళలను వేధిస్తున్న ఓ నీచుడిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు మనిషి కాదు సైకో అంటున్నారు బాధితులు. వివాహితలు, అమ్మాయిలే వాడి టార్గెట్. వాట్సాప్ లో అసభ్యకర సందేశాలు, వీడియోల పంపుతూ వివాహితలు, అమ్మాయిలను వేధిస్తున్నాడు. చివరికి వాడి పాపం పండింది. పోలీసులకు దొరికిపోయాడు.



సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అమ్మాయిలు, వివాహితలే టార్గెట్:
ఆ శాడిస్ట్ పేరు దుర్గాప్రసాద్(23). సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అమ్మాయిలు, వివాహితలే వాడి టార్గెట్. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వారి ఫోన్ నెంబర్లు సంపాదిస్తాడు. ఆ తర్వాత వారి వాట్సాప్ నెంబర్ కు వీడియో కాల్ చేస్తాడు. వాట్సాప్ లో తనకు నగ్నచిత్రాలు(నూడ్) పంపాలని డిమాండ్ చేస్తాడు. లేకపోతే వారి ఫోన్ నెంబర్ ను అశ్లీల వెబ్ సైట్లలో(పోర్న్ సైట్లలో) పెడతానని బెదిరిస్తాడు.

నూడ్ ఫొటోలు, వీడియోలు పంపాలని బ్లాక్ మెయిల్:
నగ్న చిత్రాల కోసం వీడియో కాల్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నాడు ఆ సైకో. ఇప్పటికే చాలామందిని ఇలా వేధించిన దుర్గాప్రసాద్, ఓ మహిళా అడ్వకేట్ కు ఇలాగే మెసేజ్ లు పంపడంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆదర్శ్ నగర్ లో నివాసం ఉండే దుర్గాప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు.

జైలు నుంచి వచ్చినా మార్పు లేదు:
కాగా, దుర్గాప్రసాద్ గతంలోనూ ఇలాంటి నీచానికి పాల్పడి జైలుకి కూడా వెళ్లొచ్చాడు. జైలు నుంచి వచ్చినా వాడిలో ఎలాంటి మార్పు లేదు. దుర్గాప్రసాద్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. వాడి కాంటాక్ట్ లిస్టులో లేడీ డాక్టర్లు, లాయర్లు, యువతుల ఫోన్ నెంబర్లు గుర్తించారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. దుర్గాప్రసాద్ పై 2017లోనే నల్లగొండ జిల్లాలో ఒకటి, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 వేధింపుల కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. దుర్గాప్రసాద్ మనిషి రూపంలో ఉన్న మృగం. పోర్న్ కి బాగా అడిక్ట్ అయ్యాడు. మహిళలు, అమ్మాయిల నూడ్ చిత్రాలు, వీడియోలు చూడటం అంటే వాడికి చాలా ఇష్టం. ఈ క్రమంలో వాడో సైకోలా తయారయ్యాడు.

సోషల్ మీడియాతో జాగ్రత్త:
ఈ ఘటన తర్వాత పోలీసులు ఓ హెచ్చరిక చేశారు. అమ్మాయిలు, యువతులు, మహిళలు సోషల్ మీడియా పట్ల అలర్ట్ గా ఉండాలన్నారు. ఫోన్ నెంబర్లు, అడ్రస్ లో షేర్ చేయకూడదని చెప్పారు. అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా విషయలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని పోలీసులు సూచించారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా, ఎవరి నుంచైనా బెదిరింపులు వచ్చినా ధైర్యంగా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.