Porn Video In Online Class : షాకింగ్ : ఆన్‌లైన్ క్లాసుల్లో అశ్లీల వీడియోలు

మహారాష్ట్రలోని పూణేలో ఓ దారుణం జరిగింది. 5వ తరగతి విద్యార్ధులకు ఆన్‌లైన్‌లో క్లాసులు జరుగుతుండగా ఉన్నట్టుండి పోర్న్ వీడియో క్లిప్ ఒకటి క్లాస్ జరుగుతున్నప్పుడు ప్లే అయ్యింది. హతుశులైన విద్యార్ధుల తల్లితండ్రులు పోలీసులకు, పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

Porn Video In Online Class : షాకింగ్ : ఆన్‌లైన్ క్లాసుల్లో అశ్లీల వీడియోలు

Porn Video In Online Class

Porn Video In Online Class : కరోనా లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తుంటే.. విద్యార్దులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించారు. మహారాష్ట్రలోని పూణేలో ఓ దారుణం జరిగింది. 5వ తరగతి విద్యార్ధులకు ఆన్‌లైన్‌లో క్లాసులు జరుగుతుండగా ఉన్నట్టుండి పోర్న్ వీడియో క్లిప్ ఒకటి క్లాస్ జరుగుతున్నప్పుడు ప్లే అయ్యింది. హతుశులైన విద్యార్ధుల తల్లితండ్రులు పోలీసులకు, పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

పూణేలోని రాజగురునగర్‌లోని ఒక ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం స్కూలు విద్యార్ధులకు శుక్రవారం ఆన్‌లైన్‌లో క్లాస్‌లు జరుగుతున్నాయి. 5వ తరగతి విద్యార్ధులకు జరిగే ఆన్‌లైన్ క్లాసుల గ్రూప్‌లో ఒక పాస్‌వర్డ్‌తో కూడిన లింక్ షేర్ చేయబడింది. తమ పాఠాలకు చెందిన వీడియో అనుకుని చాలామంది పాస్‌వర్డ్‌తో వీడియోను ఓపెన్ చేసి చూశారు. విద్యార్ధులు,తల్లితండ్రులు ఆవీడియో చూసి షాక్‌కు గురయ్యారు. విషయం తెలిసిన కొందరు తల్లితండ్రులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అది పోర్న్ వీడియో లింక్.

క్లిప్ ప్లే చేయబడినప్పుడు దాదాపు 30 మంది విద్యార్ధులు ఆన్‌లైన్ క్లాస్‌లో ల్యాప్‌టాప్‌ల ద్వారా, స్మార్ట్‌ఫోన్లు ద్వారా క్లాస్‌కు హజరయి ఉన్నారు. వీడియో చూసిన చాలామంది విద్యార్ధులు లాగ్‌ఔట్ అయి ఆన్‌లైన్ క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. కొందరు తల్లితండ్రులు వెంటనే స్కూల్ హెడ్మాస్టర్‌కి ఫిర్యాదు చేశారు. చాలామంది విద్యార్ధులు క్లాస్‌లకు హాజరవటానికి వారి తల్లి తండ్రులు లాగిన్ అయి ల్యాప్ టాప్, ఫోన్ ఇస్తుంటారు. ఆన్‌లైన్ క్లాస్‌కు హాజరయ్యే యాప్ లాగిన్ అయిన వెంటనే ఈ ఘఠన జరిగింది. లాగిన్ అయిన వెంటనే స్క్రీన్ మీద పోర్న్ వీడియో కనపడేసరికి తల్లితండ్రులు షాకయ్యారు.

ఆన్‌‌లైన్ తరగతులలో ఇలాంటి అసందర్భ వీడియోలు ప్లే అయిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి… కానీ పోర్న్ వీడియో ప్లే అవటం ప్రస్తుతం కలకలం రేపుతోంది. గతంలో క్లాస్‌రూమ్ లోకి ఫోన్‌ను అనుమతించని పాఠశాలలు ఇప్పుడు ఫోన్లలోనే క్లాసులు నిర్వహిస్తుండటం విశేషం. కాగా ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం ఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ‌య‌టివ్య‌క్త‌లు ఈ లింక్‌ను ఫార్వ‌ర్డ్ చేశార‌ని తాము అనుమానిస్తున్నామ‌ని ఖేడ్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ స‌తీష్ గౌర‌వ్ తెలిపారు.