Friendly Police : మీ స్మార్ట్ ఫోన్ పోయిందా …మాకు ఫిర్యాదు చేయండి తెచ్చిస్తాం అంటున్న పోలీసులు

కొంత మంది ప్రజలు ఫోను పోగొట్టుకొని ఆర్థికంగా నష్టపోతున్నారనే భావనతో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించారు.

Friendly Police : మీ స్మార్ట్ ఫోన్ పోయిందా …మాకు ఫిర్యాదు చేయండి తెచ్చిస్తాం అంటున్న పోలీసులు

Prakasam Dist Sp Mallika Garg

Friendly Police :  ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వారంటూ ఎవరూ లేరు. కోవిడ్ సమయంలో స్కూలు విద్యార్ధులకు సైతం సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించారు. అదే క్రమంలో సెల్ ఫోన్ చోరీలు పెరిగాయి. గతంలో సెల్ ఫోన్ పోయిందని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అవి ఎప్పటికి దొరుకుతాయో తెలియని పరిస్ధితి ఉండేది.

దాని కారణంగా కొంత మంది ప్రజలు ఫోను పోగొట్టుకొని ఆర్థికంగా నష్టపోతున్నారనే భావనతో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించారు. అలాంటి ఫిర్యాదుకు సంబందించిన నూతన ప్రొఫార్మాను తయారు చేసారు.  ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారి ఫిర్యాదులను పోలీసులు తక్షణమే స్వీకరించి చేధించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Also Read : Vellore SP Chased Thiefs : దోపిడీ చేసి పారిపోతున్న దొంగలను ఛేజ్ చేసి పట్టుకున్న వెల్లూరు ఎస్పీ
జిల్లాలో సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఇకనుంచి తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీపంలోని  పోలీస్ స్టేషన్‌కి   వెళ్లి కొత్తగా రూపోందించిన  ఫారం ఫిల్ చేసి రిసెప్షన్ కౌంటర్ లో ఇవ్వాలి.  ప్రతిగా ఆ ఫిర్యాదు దారునికి  పోలీసుులు  ఫిర్యాదు స్వీకరించినట్లుగా రసీదు ఇస్తారు.  అనంతరం పోలీసులు ఆ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఆ వివరాలను ఐటీ. కోర్ టీంకు పంపడం జరుగుతుంది.

ఐటీ కోర్ టీంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో   కూడిన అప్లికేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ మొబైల్ ఫోనును    ట్రేస్ చెయ్యడం జరుగుతుంది. దీని ద్వారా భాదితులకు వారి ఫోన్ తిరిగి లభించడం జరుగుతుందని ఆమె అన్నారు. తద్వారా పోలీస్ శాఖపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని, ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి ముందుంటుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు పోలీసు స్టేషన్ కు కూడా వెళ్ళలేని వారు,  పోలీస్ శాఖకు చెందిన వాట్స్ యాప్ నెంబర్ 9121102266 కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలిపారు.