ప్రణయ్ కేసు : మారుతీరావు ఆత్మహత్యపై అనుమానాలు

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 04:19 AM IST
ప్రణయ్ కేసు : మారుతీరావు ఆత్మహత్యపై అనుమానాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ? ఎవరైనా చంపేశారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాన కారణాలంటీ ? అనే ప్రశ్నలు ఉత్సన్నమౌతున్నాయి. చింతల్ బస్తీలోని ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో 306 గదిలో ఇతను సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న తీరు చూస్తే..ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి.

బెడ్‌పై పడుకుని..చేతులు ముడుచుకున్నట్లుగా ఉంది. ఉరి వేసుకోవడానికి ఉపయోగించిన వస్తువు కనిపించడం లేదు. విషం తీసుకున్నాడా ? తెలియాల్సి ఉంది. ఒక్కడే వచ్చాడా ? లేక ఇంకెవరు వచ్చారనేది తెలియడం లేదు. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్‌లు కీలకంగా మారనున్నాయి. ఆధారాలు కోసం క్లూస్ టీం రంగంలోకి దిగింది. చనిపోయే ముందు…ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. 

తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లిచేసుకుందన్న అక్కసుతో 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ప్రణయ్‌ను కిరాయి హంతకులతో మారుతీ రావు హత్య చేయించినట్టు కేసు నమోదయ్యింది. జైలు జీవితం గడిపి..బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో…మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కూడా కలకలం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది? అన్నది ఇంతవరకు తేలలేదు. ఇందులో విచారణ ఎదుర్కొంటున్నారు మారుతీరావు. 

2020, మార్చి 07వ తేదీ శనివారం సాయంత్రం 6.30గంటలకు వచ్చాడని, ఇతనితో పాటు డ్రైవర్‌ కూడా వచ్చారని ఆర్యవైశ్య భవన్ నిర్వాహకులు 10tvకి వెల్లడించారు.  2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఉదయం..డోర్ కొట్టినా..తీయలేదని డ్రైవర్ చెప్పాడని, వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. వారు వచ్చి చూడగా…బెడ్‌పై విగతజీవిగా కనిపించాడన్నారు. కుటుంబసభ్యులు వచ్చారని తెలిపారు. 

తండ్రి మారుతీరావుపై అమృత అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తండ్రి దగ్గరకు వెళ్లనని అమృత పలుసార్లు వెల్లడించింది. కానీ తనను రప్పించేందుకు తండ్రి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, మనుషులు పంపిస్తున్నారంటూ అమృత ఆరోపణలు చేసింది. కేసుల క్రమంలో…మానసిక ఒత్తిడి భరించలేని మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి. 

Read More : బ్రేకింగ్ న్యూస్ : ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు