ఏం జరిగింది : ప్రీతిరెడ్డి హత్య కేసులో వీడని చిక్కుముడి

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2019 / 04:31 AM IST
ఏం జరిగింది : ప్రీతిరెడ్డి హత్య కేసులో వీడని చిక్కుముడి

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణహత్యకు గురైన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడటం లేదు. అసలు ప్రీతి మరణానికి ముందు ఏం జరిగిందన్నదానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రీతి హత్య కేసులో  నిందితుడిగా భావిస్తున్న ఆమె మాజీ ప్రియుడు హర్ష్ నడ్డేకు ఎటువంటి నేరచరిత్ర లేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని డిటెక్టివ్‌ సూపరింటెండెంట్‌ గావిన్‌ డెన్‌ గేట్‌ హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రీతి రెడ్డి ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ గా పనిచేస్తుంది.ఆదివారం(మార్చి-3,2019) ఉదయం 2:15 గంటల సమయంలో  సిడ్నీలోని స్ట్రాండ్ ఆర్కెడ్ దగ్గర ఉన్న మెక్ డొనాల్డ్ లో కన్పించిన ప్రీతి ఆ తర్వాత సడన్ గా మాయమైపోయింది. తల్లిదండ్రుల కంప్లెయింట్ లో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం(మార్చి-5,2019) రాత్రి రోడ్ సైడ్ పార్క్ చేసి ఉన్న ఆమె కారులోనే సూట్ కేసులో అనేక కత్తిపోట్లకు గురై ఉన్న ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె మరణానికి ముందు ఏం జరిగిందన్నదానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2

ఈ కేసులో నిందితుడుగా భావిస్తున్న ఆమె మాజీ ప్రియుడు హర్ష్‌ నర్డే ఆమె కోసమే శనివారం టామ్‌ వర్త్‌ నుంచి సిడ్నీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలియడం వల్లే ఆమెతో మాట్లాడేందుకు అతను వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా ప్రీతిరెడ్డి మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతానికి 340 కి.మీ.ల దూరంలో..తన కారు, ఓ ట్రక్‌ ను ఢీకొట్టడంతో నర్డే కూడా సోమవారం(మార్చి-4,2019) రాత్రి మృతి చెందాడు. కావాలనే అతడు యాక్సిడెంట్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

శనివారం(మార్చి-2,2019) ఓ డెంటల్ కాన్ఫరెస్స్ కు  నర్డే,ప్రీతిలు హాజరయ్యారు. అదే రోజు రాత్రి  ఓ హోటల్‌ దగ్గర ఇద్దరూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా చూశానని, వారు ఆనందంగానే కనిపించారని ఇద్దరికీ తెలిసిన సహచరుడొకరు తెలిపారు. సదస్సు అయిపోయిన తర్వాత అతను ఫేస్‌బుక్‌ తీసి ఏదో రాయడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. తనకు తెలిసిన ఓ వ్యక్తితోనే అదే హోటల్‌లో ఆమె బస చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. హోటల్‌ సీసీటీవీ కెమేరాలో ఆదివారం మధ్యాహ్నం పోర్టర్‌ సహాయంతో నర్డే ఓ భారీ సూట్‌కేసును కారులోకి ఎక్కిస్తున్న దృశ్యాలు నమోదైనట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. ప్రీతిరెడ్డి మృతదేహాన్ని అందులోనే ఉంచి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read : టాక్ ఆఫ్ ది టౌన్ : చిలుక పట్టి తెస్తే.. రూ.20 వేలు రివార్డు

మరోవైపు ప్రీతిరెడ్డి అదృశ్యమైన తర్వాత ఆమె కోసం విచారిస్తున్న సమయంలోనే ఆదివారం రాత్రి నర్డే, ఆమె స్నేహితుల్లో ఒకరికి మెసేజిలు పెట్టినట్లు గుర్తించారు. ప్రీతిరెడ్డితో తాను శనివారం సాయంత్రం మాట్లాడానని, ఇంటికి వెళుతున్నట్లు తనకు చెప్పిందని నర్డే తెలిపాడు. ఆమె అదృశ్యం గురించి అడగ్గా ఎక్కడైనా నిద్రపోతూ ఉండవచ్చని సమాధానమిచ్చాడు. ఈ కేసులో మరెవరినీ అనుమానితులుగా భావించడం లేదని న్యూ సౌత్‌ వేల్స్‌ పోలీసులు తెలిపారు.
Also Read : ఆన్ లైన్‌లో ప్రపోజ్ చేస్తే చంపేస్తా : హీరోయిన్ సోనాక్షి సిన్హా